మరో స్వర్ణం గెలిచిన షూటర్‌ అపూర్వీ చండేలా

మరో స్వర్ణం గెలిచిన షూటర్‌ అపూర్వీ చండేలా
x
Highlights

ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న భారత షూటర్‌ అపూర్వీ చండేలా తన తిరిగి సత్తా చాటింది. అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య...

ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న భారత షూటర్‌ అపూర్వీ చండేలా తన తిరిగి సత్తా చాటింది. అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో అపూర్వీ విజేతగా నిలిచింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య 24 షాట్‌లతో ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వీ 251 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. వాంగ్‌ లుయావో (చైనా–250.8 పాయింట్లు) రజతం గెల్చుకోగా... జు హాంగ్‌ (చైనా–229.4 పాయింట్లు) కాంస్య పతకం కైవసం చేసుకుంది.

ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లలో ఈ ఏడాది అపూర్వీకిది రెండో స్వర్ణం. ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచకప్‌లోనూ అపూర్వీ పసిడి పతకం సాధించింది. స్వర్ణం కోసం అపూర్వీ, వాంగ్‌ లుయావో మధ్య హోరాహోరీ పోరు జరిగింది. నిర్ణీత 22 షాట్‌ల తర్వాత అపూర్వీ230.4 పాయింట్లతో, వాంగ్‌ 229.9 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. చివరి షాట్‌కు ముందు అపూర్వీ (240.6 పాయింట్లు), వాంగ్‌ (240.5 పాయింట్లు) మధ్య వ్యత్యాసం కేవలం 0.1 పాయింట్లు. ఆఖరి షాట్‌లో అపూర్వీ 10.4 స్కోరు చేయగా... వాంగ్‌ 10.3తో సరిపెట్టుకుంది. ఫలితంగా అపూర్వీ 0.2 పాయింట్ల తేడాతో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది.

ఫైనల్లో పోటీపడిన భారత్‌కే చెందిన మరో షూటర్‌ ఇలవేనిల్‌ వలారివన్‌ (208.3 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories