Team India: టీమిండియా సారథిగా గబ్బర్.. ఆ టోర్నీతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం..!

Shikhar Dhawan set to Lead Team India in Asian Games 2023 Hangzhou Indian Team BCCI
x

Team India: టీమిండియా సారథిగా గబ్బర్.. ఆ టోర్నీతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం..!

Highlights

Asian Games 2023: ఎడమచేతి వాటం స్టార్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 37 ఏళ్ల ధావన్ గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు.

Shikhar Dhawan: ఎడమచేతి వాటం స్టార్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. 37 ఏళ్ల ధావన్ గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరపున చివరి మ్యాచ్ ఆడాడు. ఇటీవలి ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, శిఖర్ జట్టు ప్లేఆఫ్‌కు కూడా చేరలేకపోయింది. అయితే, తాజాగా శిఖర్ ధావన్ గురించి ఓ పెద్ద వార్త వినిపిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, శిఖర్ ధావన్ 2022 ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించవచ్చని తెలుస్తోంది. అయితే NCA చీఫ్ VVS లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతను పొందవచ్చని అంటున్నారు. ఆసియా క్రీడలు 2023లో సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగాల్సి ఉంది. జులై 7న జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆసియా క్రీడలపై చర్చ జరగనుంది.

మహిళలు, పురుషుల ఈవెంట్‌లకు తమ జట్టును పంపేందుకు బీసీసీఐ అంగీకరించింది. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ (అక్టోబర్ 5-నవంబర్ 19)ట్రోఫీ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. దీని కారణంగా పురుషుల ఈవెంట్‌లో రెండవ శ్రేణి భారత జట్టు చైనాకు వెళుతుంది. ఇక మహిళల విభాగంలో ఫుల్‌ స్ట్రెంత్‌ టీమ్‌ను పంపనున్నారు. రితురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక కాకపోతే.. వారికి కూడా ఆసియా క్రీడలకు అవకాశం దక్కుతుంది.

పెద్ద టోర్నమెంట్లలో ధావన్ బ్యాట్ గొప్పగా మాట్లాడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2013లో శిఖర్ 90.75 సగటుతో 363 పరుగులు, ఆసియా కప్-2014లో 48 సగటుతో 192 పరుగులు, ప్రపంచకప్-2015లో 51.50 సగటుతో 412 పరుగులు, 2015లో సగటున 338 పరుగులు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2017లో 67.60, ఆసియా కప్‌లో 68.40 సగటుతో 342 పరుగులు చేశాడు.

శిఖర్ ధావన్ అంతర్జాతీయ రికార్డులు:

టీ20 ఇంటర్నేషనల్ - 68 మ్యాచ్‌లు, 1759 పరుగులు, 27.92 సగటు, 11 అర్ధ సెంచరీలు.

వన్డే ఇంటర్నేషనల్ - 167 మ్యాచ్‌లు, 6793 పరుగులు, 44.11 సగటు, 17 సెంచరీలు,39 అర్ధ సెంచరీలు.

టెస్ట్ క్రికెట్ - 34 మ్యాచ్‌లు, సగటు 24,1 231 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు.

IPL - 217 మ్యాచ్‌లు, 6617 పరుగులు, 35.39 సగటు, రెండు సెంచరీలు, 50 అర్ధ సెంచరీలు.

కరోనా కారణంగా ఆసియా క్రీడలు వాయిదా..

19వ ఆసియా క్రీడలు గత ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు జరగాల్సి ఉండగా, చైనాలో కరోనా వైరస్ కేసు పెరగడంతో ఈ గేమ్స్ వాయిదా పడ్డాయి. ఓవరాల్ గా మూడోసారి చైనాలో ఆసియా క్రీడలు జరగబోతున్నాయి. చైనా రాజధాని బీజింగ్ 1990లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వగా, 2010లో గ్వాంగ్‌జౌ ఈ ప్రతిష్టాత్మకమైన గేమ్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పొందింది. ఆసియా క్రీడల్లో క్రికెట్ ఈవెంట్ మూడోసారి నిర్వహించనున్నారు. 2014, 2014 గేమ్స్‌లో క్రికెట్ ఈవెంట్ కూడా జరిగింది. ఇక్కడ BCCI పురుషుల లేదా మహిళల జట్టును పంపలేదు. 2010 గేమ్స్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లు స్వర్ణం సాధించాయి. ఇక 2014లో పురుషుల విభాగంలో శ్రీలంక, మహిళల విభాగంలో పాకిస్థాన్‌ స్వర్ణం సాధించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories