IND vs SA: న్యూ ఇయర్‌కి ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. నెట్స్‌లో గాయపడిన స్టార్ ప్లేయర్.. రెండో టెస్ట్‌ నుంచి ఔట్?

Shardul Thakur Injured before India vs South Africa 2nd test match During nets session may Dought for 2nd Test
x

IND vs SA: న్యూ ఇయర్‌కి ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. నెట్స్‌లో గాయపడిన స్టార్ ప్లేయర్.. రెండో టెస్ట్‌ నుంచి ఔట్?

Highlights

India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో (IND vs SA) టీమిండియా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఆతిథ్య జట్టు సౌతాఫ్రికా 32 పరుగుల తేడాతో గెలిచి స్వదేశంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది.

India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో (IND vs SA) టీమిండియా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఆతిథ్య జట్టు సౌతాఫ్రికా 32 పరుగుల తేడాతో గెలిచి స్వదేశంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇప్పుడు రెండో టెస్టులో గెలిచి పరువు కాపాడుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. అయితే అంతకుముందు నెట్స్ సెషన్‌లో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు.

జనవరి 2న కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. కేప్ టౌన్ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో శార్దుల్ ఆడే అవకాశం లేదు. అయితే, అవసరమైతే అతని గాయం తీవ్రతను స్కాన్ ద్వారా నిర్ధారిస్తారు. అతని గాయానికి స్కాన్ అవసరమా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. అయితే గాయం చూస్తుంటే శార్దూల్ ఠాకూర్ చాలా కష్టాల్లో పడ్డాడని ఊహించుకోవచ్చు. నెట్ సెషన్‌లో శార్దూల్ బౌలింగ్ కూడా చేయలేకపోయాడు.

శార్దూల్ ఠాకూర్ త్రోడౌన్ నెట్‌కు చేరిన మొదటి ఆటగాడిగా మారాడు. అతను త్రోడౌన్‌లో ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ నుంచి బంతిని ఎదుర్కొంటున్న సమయంలో అతని ఎడమ భుజానికి బంతి తగిలింది. నెట్ సెషన్ ప్రారంభమైన 15 నిమిషాలకే శార్దూల్ గాయపడ్డాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఠాకూర్ షార్ట్ బాల్‌ను డిఫెండ్ చేయలేకపోయాడు. బంతి తగిలిన వెంటనే నొప్పితో అరిచాడు. కానీ, అతను తన బ్యాటింగ్ కొనసాగించాడు. బ్యాటింగ్ ముగించిన తర్వాత, ఫిజియో అతని భుజానికి ఐస్ ప్యాక్ వేశాడు. ఆ తర్వాత అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేయలేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories