Shardul Thakur Fastest Fifty: సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన శార్దుల్ ఠాగూర్

Shardul Thakur Fastest Fifty in Oval Test And Beats Sehwag 32 Balls Record
x

శార్దూల్ ఠాకూర్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

Shardul Thakur Fastest Fifty : భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు భారత్ ఆటగాళ్ళను మరోసారి...

Shardul Thakur Fastest Fifty : భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు భారత్ ఆటగాళ్ళను మరోసారి తక్కువ పరుగులకే ఆలౌట్ చేసింది. విరాట్ కోహ్లి, శార్దుల్ టాగూర్ ల అర్ధ సెంచరీలు మినహా భారత జట్టులో ఏ ఆటగాడు రాణించకపోవడంతో టీమిండియా 191 పరుగులతో సరిపెట్టుకుంది. ఇక 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పరిస్థితిలో భారత్ కనీసం 100 పరుగులైన చేయగలుగుతుందో లేదో.. మరోసారి మూడో టెస్ట్ మ్యాచ్ సీన్ రిపీట్ అవుతుందేమోనని అభిమానులు అనుకుంటున్న తరుణంలో విరాట్ కోహ్లి అర్ధ సెంచరీ చేసి ఔటవడంతో 127 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన శార్దుల్ టాగూర్ తన ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు.

కేవలం 31 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి టెస్ట్ మ్యాచ్ లలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు. లెజెండరీ ఆటగాడు కపిల్ దేవ్ 30 బంతుల్లో అర్ధసెంచరీ చేయగా, సెహ్వాగ్ 32 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. మరోపక్క ఓవల్ మైదానంలో ఇప్పటివరకు ఇయాన్ బోధమ్ పేరు మీద 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డుని అధిగమించి ఇంగ్లాండ్ గడ్డపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడుగా శార్దుల్ టాగూర్ రికార్డు సృష్టించాడు.

నాలుగో టెస్ట్ మొదటి రోజు మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో షార్దుల్ ని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ లార్డ్ అని ముద్దుపేరుతో పిలవడం మొదలుపెట్టారు. మరో పక్క తన సహచర ఆటగాళ్లు బీఫీ అని పిలుస్తున్నారని షార్దుల్ చెప్పిన వీడియోని ట్విట్టర్ వేదికగా బిసిసిఐ పోస్ట్ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories