Sachin Tendulkar: సచిన్ బాదిన మొదటి శతకానికి ముప్పై ఏళ్ళు!

Sachin Tendulkar: సచిన్ బాదిన మొదటి శతకానికి ముప్పై ఏళ్ళు!
x
sachin tendulkar (file photo)
Highlights

Sachin Tendulkar: ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్

Sachin Tendulkar: ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ (Sachin Ramesh Tendulkar). క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. 16-నవంబర్-2013 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఈయనకు ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్.

30 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున భారత్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తన తోలి టెస్ట్ శతకాన్ని నమోదు చేసాడు. 1990ఇంగ్లాండ్ గడ్డపై ఆ దేశానికీ చుక్కలు చూపించాడు. వంద శతకాలకు తోలి నాంది వేసాడు. మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ ఐదో రోజు ఓటమిలో ఉన్న భారత్ కు 17 ఏళ్ల సచిన్ టెండూల్కర్ అపద్బంధవుడిలా మారాడు. కఠినమైన పిచ్ పై 119 పరుగులు చేసి ఏంటో ఓర్పుగా బ్యాటింగ్ చేసి జట్టును ఒకమి నుంచి గట్టెక్కించాడు.

1990 దశకంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసిన ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్ను పొగడని వారు లేరనే చెప్పవచ్చు. లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్ అని పిలువబడే సచిన్ 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. 1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా జగత్తులోని అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరు సచిన్ టెండుల్కర్..

2010 ఫిబ్రవరి 24 న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు సాధించిన మొట్ట మొదటి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే 2010 డిసెంబర్ 19 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే క్రికెటర్ అందుకోని మైలురాయిని అధిరోహించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories