Sachin Tendulkar On Friendship Day : స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని
Sachin Tendulkar On Friendship Day : స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది. జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం స్నేహం'. హృదయపు తలుపును ఒక్కసారి తడితే.. అందులోని మాధుర్యమంతా ప్రతి హృదయంలో గుబాళిస్తుంది.
ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది...ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ 'స్నేహం' తరతరాలకు తీపిని పంచుతోంది.. కాలాలకతీతంగా మైత్రి మధురిమను పెంచుతోంది...కన్నవారితో, కట్టుకున్నవారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం. కష్టసుఖాల్లో అండగా ఉండేవారు.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు.
ఇలాంటి స్నేహితుల కోసం ఓ రోజు ఉంది. అదే స్నేహితుల దినోత్సవం. ఇంతటి గొప్ప స్నేహితుల దినోత్సవాన్ని మన భారత దేశంలో ప్రతి ఏటా ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున 'ఫ్రెండ్‌షిప్ డే ' ను ఘనంగా నిర్వహించుకుంటారు. అందులో భాగంగానే భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పాడు ." స్నేహబంధం అనేది స్టేడియంలోని ఫ్లడ్ లైట్ల లాంటిది. ఓ మూల నుంచి మన విజయాలను ఆస్వాధిస్తాయి. వెలుగు దూరమై సూర్యుడు అస్తమిస్తున్న వేళ వాటంతటవే వెలిగి చీకటిని తొలగించి వెలుగునిస్తాయి" అని సచిన్ పేర్కొన్నాడు.
Friendships are like floodlights on a cricket field. They enjoy your success from the corner. But if they realise the sun's going down on you, they light themselves up to provide brightness around you.
— Sachin Tendulkar (@sachin_rt) August 2, 2020
For me, everyday is #FriendshipDay. pic.twitter.com/i80PIT6Knu
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire