మాస్టర్ బ్లాస్టర్ అదొక్కటి ఎందుకు మర్చిపోయావ్.. మైదానంలో ఏడ్చిన సచిన్

మాస్టర్ బ్లాస్టర్ అదొక్కటి ఎందుకు మర్చిపోయావ్.. మైదానంలో ఏడ్చిన సచిన్
x
Sachin Tendulkar
Highlights

సచిన్ రమేష్ టెండూల్కర్ కొత్తగా అనిపించిదా? మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇది చెప్పాల్సిన అవసరం లేదు.

సచిన్ రమేష్ టెండూల్కర్ కొత్తగా అనిపించిదా? మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇది చెప్పాల్సిన అవసరం లేదు.ఈ భారత రత్నం సాధించిన రికార్డులు, అందుకున్న అవార్డులు క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దాదాపు రెండున్నర దశాబ్దలుగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలినా క్రికెట్ దేవుడు రిటైర్మెంట్ తీసుకుని ఏడేళ్లు గడుస్తున్నా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సచిన్ టెండూల్కర్‌ గ్రౌండ్ దిగితే చాలు అభిమానులు కేరింతలతో ఉత్సాహంతో ఊగిపోయేవారు. ఏప్రిల్ 24, 1973లో జన్మించిన సచిన్ ఇవాళ (ఏప్రిల్ 24) 47వ పడిలోకి అడుగుపెట్టారు.

అయితే 16 ఏళ్ల వయసులోనే 1989 నవంబరు నెల 15న అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్ క్రికెట్ కెరీర్ లో ఒక్కటి మాత్రం అలాగే వదలి వెళ్ళాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 463 వన్డేల్లో ఆడిన సచిన్ 44.83 యావరేజ్ తో 18,426 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ లో పాకిస్తాన్ ఆటగాడు అన్వర్ (194) నెలకొల్పిన వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో 147 బంతుల్లో 25 ఫోర్లు 3 సిక్సులతో 200* ఫస్ట్ డబుల్ సెంచరీ సాధించి రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో 96 అర్థ సెంచరీలు, 49 శతకాలు నమోదు చేశాడు.

అయితే సచిన్ మంచి ఫోమ్ లో వుండగానే క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. సచిన్ మరి కొన్ని రోజులు ఆడాలని కోరుకున్న వారు ఉన్నారు. కొందరైతే 49 వన్డే సెంచరీలు చేసిన సచిన్ ఆ ఒక్క శతకం పూర్తి చేస్తే వన్డేల్లో 50 సెంచరీలు చేసిన ఘనత వుండేదని భావించారు. ఇక 200ల టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 53.79 సగటుతో 15,921 పరుగులు చేశాడు. 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 51 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. పొట్టి ఫార్మాట్ లో కేవలం ఒక్క మ్యాచ్ ఆడారు.

కెప్టెన్సీ చేదు అనుభవం

ఇన్ని ఘనతలు సాధించిన సచిన్ కు చేదు అనుభవం మిగిలిన క్షణాల క్రికెట్ చరిత్రలో ముఖ్యంగా సచిన్ క్రికెట్ కెరీర్ లో మర్చిపోలేని జ్ఞాపకాలు. 1996లో అజారుద్దీన్ తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన సచిన్ టెండూల్కర్.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీసులలో ఘోర పరాభవాన్ని ఆ తర్వాత ఏడాదికే సచిన్ టీమిండియా కెప్టెన్సీ కి రాజీనామా చేశారు.

వెక్కి వెక్కి ఏడ్చిన సచిన్

చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే భావోద్వేగాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1999లో చెన్నైలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో సచిన్‌ టెండూల్కర్‌ వేదనే అనుభవించాడు. మ్యాచ్‌లో గాయంతో బాధపడుతూనే మరోవైపు అద్భుత బ్యాటింగ్‌తో విజయానికి చేరువ చేశాడు. కానీ విజయానికి మరో 4 పరుగుల దూరంలో సచిన్‌ ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి భారత్‌ 12 పరుగులతో ఓడటం చక చకా జరిగిపోయాయి. చెన్నై గ్రాండ్లో ప్రేక్షకులు సచిన్ పోరాటానికి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.

మైదానం వీడిన సచిన్‌ నిరాశ చెందాడు. టీమిండియా ఓడిపోయిందని తెలిసిన డ్రెస్సింగ్ రూం నుంచి బయటకే రాలేదు. చేతి రుమాలు అడ్డుగా పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా తీసుకోవడానికి కూడా సచిన్ వెళ్లలేదు. అవార్డ్ ప్రదాన కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా సచిన్ తన సీటులో అలానే ఉండిపోయాడు. దీనిని పట్టే సచిన్ క్రికెట్ అంటే ఎంత ప్రాణం. టీమిండియా క్రికెట్ చరిత్రలో సచిన్ లేని జట్టును ఊహించుకోవడం అంటే ఎంతో కష్టం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories