Rohit Sharma: ఆస్ట్రేలియాకు వెళ్లనున్న రోహిత్‌ శర్మ.. ఎప్పుడంటే?

Rohit Sharma
x

Rohit Sharma

Highlights

Rohit Sharma: భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. బోర్డర్-గవాస్కర్ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడానికి సిద్ధమైంది.

Rohit Sharma: భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. బోర్డర్-గవాస్కర్ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడానికి సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి పెర్త్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. శుక్రవారం ఉదయం 7.50కి తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్టుకు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ ఇటీవల శర్మ దూరమైన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టుకు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించనున్నాడు. అయితే మొదటి టెస్ట్ ఆరంభానికి ముందు భారత జట్టుకు ఓ శుభవార్త.

భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్తాడు, ఎప్పుడు జట్టుతో కలుస్తాడు? అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. క్రిక్‌బజ్ ప్రకారం.. రోహిత్ నవంబర్ 24న పెర్త్‌లో భారత జట్టులో చేరతాడు. నవంబర్ 22 నుంచి ఆప్టస్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ఆరంభం కానుండగా.. మూడోరోజు హిట్‌మ్యాన్ జట్టుతో కలుస్తాడు. నవంబర్ 23న భారత్ నుంచి రోహిత్ బయల్దేరనున్నాడు. ఇటీవలే రోహిత్‌కు కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. పుత్రోత్సాహంలో ఉన్న రోహిత్ మొదటి టెస్టుకు అందుబాటులో ఉండనని బీసీసీఐకి ముందే చెప్పాడు.

రోహిత్ శర్మ స్థానంలో పెర్త్ టెస్టులో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్ లేదా కేఎల్ రాహుల్‌లో ఒకరు ఆడనున్నారు. రాహుల్ ఆడే అవకాశాలే ఉన్నాయి. సీనియర్ ఆటగాడికే బీసీసీఐ టీమ్ మేనేజ్మెంట్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. న్యూజీలాండ్ సిరీస్‌లో విఫలమైనా.. అతడిపై నమ్మకం ఉంచిందట. మరోవైపు తొలి టెస్టు కోసం యువ బ్యాటర్ దేవ్‌దత్‌ పడిక్కల్‌ను కూడా బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. గాయాడిన గిల్ స్థానంలో పడిక్కల్‌ ఆడనున్నాడని తెలుస్తోంది.

ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, దేవ్‌దత్‌ పడిక్కల్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories