ఇవాళే లెజెండ్స్ క్రికెట్ సిరీస్.. ఓపెనర్లగా సచిన్, సెహ్వాగ్

ఇవాళే లెజెండ్స్ క్రికెట్ సిరీస్.. ఓపెనర్లగా సచిన్, సెహ్వాగ్
x
Sachin Tendulkar, Virender Sehwag File Photo
Highlights

ఈ శనివారం నుంచే లెజెండ్స్ క్రికెట్ సిరీస్ ప్రారంభం కానుంది. లారా నేతృత్వంలోని వెస్టిండీస్ టీమ్ పై సచిన్ టీమ్ తలపడనుంది.

టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్లు సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ జోడి మరో సారి ఓపెనర్లుగా దిగబోతున్నారు. సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్ చేస్తే అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించిన చాల కాలం తర్వాత వీరు మళ్లి బరిలోకి దిగనున్నారు. అయితే వీరు ఓపెనర్లుగా దిగనుంది టీమిండియా తరపున కాదు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2020 ఓ చారీటీ మ్యాచ్‌లో కావడం విశేషం. సచిన్, సెహ్వాగ్ జోడి గతంలోలా మెరుపులు మెరిపిస్తోందా లేదో చూడాలి.

మహారాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మాజీ క్రికెటర్లతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2020 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తుంది. ఈ టోర్నీఆ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా విభాగంతోపాటు అన్ అకాడమీ ఫ్రోఫెషనల్ మేనేజ్‌మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని భారత లెజెండ్స్, బ్రియాన్ లారా ఆధ్వర్యంలోని వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య ఇవాళ సాయంత్రం 6గంటకు ప్రారంభం కానుంది.

వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌తో పాటు యువరాజ్‌ సింగ్‌, మహ్మద్‌ కైఫ్‌, అజిత్‌ అగార్కర్‌, ఇర్ఫాన్ పఠాన్, ప్రజ్ఞాన్‌ ఓజా, జహీర్‌ ఖాన్‌లు , మునాఫ్‌ పటేల్‌, ఆడనున్నారు. విండీస్‌ జట్టు నుంచి చందర్‌పాల్‌, హూపర్, గంగ, బద్రి, ఆడుతున్నారు. భారత్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక జట్ల నుంచి దిగ్గజ మాజీ క్రికెటర్లు భాగస్వాములు కానున్నారు. ఈ టోర్నీలో మొత్తం 11 మ్యాచ్‌లు జరగనున్నాయి. వాంఖడే స్టేడియంలో రెండు, ఎమ్‌సీఏ మైదానంలో పుణెలో 4, డీవై పాటిల్ స్టేడియంలో 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ బ్రాబౌర్న్ మైదానంలో జరగనుంది.

సచిన్ భారత జట్టును నడిపించనుండగా.. జాంటీ రోడ్స్ ( సౌతాఫ్రికా), బ్రియన్ లారా ( వెస్టిండీస్), బ్రెట్‌లీ (ఆస్ట్రేలియాన), తిలక రత్న దిల్షాన్ (శ్రీలంక) సారథ్యం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లు రాత్రి 6 గంటలకు ప్రారంభం కానున్నాయి. సిన్‌ప్లాక్స్, కలర్స్, కలర్స్ కన్నడ, సినిమా చానెల్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. డిజిటల్ పార్టనర్స్‌గా వూట్, జియో వ్యవహరించనున్నాయి.

ప్రతీ సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య 1.35 మిలియన్లు ప్రపంచవ్యాప్తంగా ఉండగా.. కేవలం భారత్‌లోనే 1,49000 ఉండటం గమనార్హం. క్రికెట్‌కు దేశంలో ఆదరణ ఎక్కువగా ఉండటంతో.. ఆ దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే ఈ టోర్నీ జరుపుతున్నట్లు వారు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories