Team India: ప్రపంచకప్‌లో 12 ఏళ్ల తర్వాత.. అద్భుత ఫీట్‌తో అదరగొట్టిన టీమిండియా ఆల్ రౌండర్.. అదేంటంటే?

Ravindra Jadeja Took 5 Wickets Against South Africa 2nd Indian Bowler to Take Fifer After Yuvraj in ICC ODI World Cup
x

Team India: ప్రపంచకప్‌లో 12 ఏళ్ల తర్వాత.. అద్భుత ఫీట్‌తో అదరగొట్టిన టీమిండియా ఆల్ రౌండర్.. అదేంటంటే?

Highlights

World Cup 2023: ప్రపంచ కప్ 2023లో తన ఎనిమిదో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ టోర్నీలో భారత జట్టు అజేయంగా ముందుకు దూసుకెళ్తోంది.

World Cup 2023: ప్రపంచ కప్ 2023లో తన ఎనిమిదో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 243 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ టోర్నీలో భారత జట్టు అజేయంగా ముందుకు దూసుకెళ్తోంది. భారత్ 8 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, 16 పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో భారత జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ ఓ అద్భుతమైన ఫీట్ చేశాడు. ఇది చివరిసారిగా 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ చేశాడు. 12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో ఇలాంటి అద్భుమైన ఫీట్ చేశాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్‌ను సమం చేశాడు. ఇప్పుడు ఇద్దరి పేర్లతోనూ 49 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ మరో సెంచరీ సాధించిన వెంటనే ఈ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు.

ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లు తీశాడు. ప్రపంచకప్ చరిత్రలో యువరాజ్ సింగ్ తర్వాత 5 వికెట్లు తీసిన రెండో భారతీయుడిగా జడేజా నిలిచాడు. అంతకుముందు యువరాజ్ సింగ్ 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై 5 వికెట్లు పడగొట్టాడు.

భారత్ నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు 83 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన రవీంద్ర జడేజా (5 వికెట్లు). కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ తలో 2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశారు.

వన్డే క్రికెట్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ఇదే అతిపెద్ద ఓటమి. ఇంతకు ముందు 2002లో పాకిస్థాన్ 182 పరుగుల తేడాతో ఓడిపోగా, 2013లో శ్రీలంక 180 పరుగుల తేడాతో ఓడిపోయింది. అదే సమయంలో, 2018 సంవత్సరంలో శ్రీలంక 178 పరుగుల తేడాతో ఈ జాబితాలో నాల్గవ అతిపెద్ద ఓటమిని అందించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories