RR vs RCB: ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపు

Rajasthan Royals to victory against the Royal Challengers Bengaluru by 4 wickets
x

RR vs RCB: ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపు

Highlights

RR vs RCB: ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుపై రాజస్థాన్ విజయం

RR vs RCB: పదిహేడో సీజన్ ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయ ల్స్ జయభేరి మోగించింది. లీగ్ దశలో వరుస ఓటముల నుంచి తేరుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాకిచ్చింది. అటు లీగ్ స్టేజిలో వరుసగా 6 మ్యాచ్ లు గెలిచి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన ఆర్సీబీ కీలక పోరులో నిరాశపరిచింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. దాంతో రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల తేడాతో గెలిచిన శాంసన్ సేన.. రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ తో క్వాలిఫయర్-2లో తలపడనుంది. కాగా అందులో గెలిచిన జట్టు 26వ తేదీన జరిగే ఫైనల్ లో కోల్ కతా టీమ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌ లో రాజస్థాన్ విజయం సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరును ఓడించి ఇంటికి పంపించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. దానిని సంజూ శాంసన్ సేన 6 వికెట్లు కోల్పోయి ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ ఓటమితో బెంగళూరు ఇంటిదారి పట్టింది. ఈసారైనా కప్పు గెలవాలన్న ఆర్సీబీ ఆశలు అడియాసలయ్యాయి.

అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ సీజన్‌లో అద్భుత ఫీట్ సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రికార్డ్‌కు చేరువలో కోహ్లీ తరువాత స్థానాల్లో శిఖర్ ధావన్ 6 వేల 769 పరుగులు, రోహిత్ శర్మ 6 వేల 628 పరుగులతో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories