స్టీవ్ స్మిత్‌కు షాకిచ్చేందు రాజస్థాన్ రాయల్స్ రెడీ

స్టీవ్ స్మిత్‌కు షాకిచ్చేందు రాజస్థాన్ రాయల్స్ రెడీ
x
Highlights

*ఐపీఎల్‌ 14 వేలానికి సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు *ఐపీఎల్ 2021 రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల చేసిన ఆర్సీబీ

ఐపీఎల్‌ పాలక మండలి రాబోయే 14వ సీజన్‌ కోసం ఫ్రాంఛైజీల మధ్య ఆటగాళ్ల బదిలీ ప్రక్రియ ప్రారంభించింది. తమకు అవసరం లేదనుకున్న క్రికెటర్లను జట్లు వదిలేసుకోవాలని సూచించడంతో ఫ్రాంచైజీలు తమకు అక్కరలేని వారిని వదిలించుకుంటున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తాము రిటైన్ చేసుకునే 12 మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, యుజువేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, సైని, ఆడమ్ జంపా, షాబాజ్ అహ్మద్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్సన్, పవన్ దేశ్‌పాండేలతో పాటు ఇటీవలే ఆసీస్‌ టూర్‌లో అద్భుత ప్రదర్శన చేసిన మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్‌లను కూడా రిటైన్‌ చేసింది.

కొన్ని ఫ్రాంచైజీలు పలువురు స్టార్‌ ఆటగాళ్లకు షాక్‌ ఇస్తున్నాయి. ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ను వదులుకునేందుకు రాజస్తాన్‌ రాయల్స్‌ సిద్ధమైంది. టీమిండియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో రిషబ్‌ పంత్‌ గార్డ్‌ మార్క్‌ను చెరిపేసి అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇలాంటి చీటింగ్‌ చేసే వ్యక్తి ఐపీఎల్‌లో ఆడకుండా బ్యాన్‌ చేయాలంటూ స్మిత్‌పై సోషల్‌ మీడియాలో​ విపరీతంగా కామెంట్స్‌ వచ్చాయి. దీంతో పాటు మరిన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని స్టీవ్ స్మిత్‌పై వేటు వేసింది.

CSK కూడా జాబితాను విడుదల చేసింది. టీమిండియా వెటరన్‌ ఆటగాళ్లు హర్బజన్‌ సింగ్‌, మురళీ విజయ్‌, పియూష్‌ చావ్లాలతో పాటు కేదార్‌ జాదవ్‌ను సీఎస్‌కే వదులుకున్నట్లు ప్రకటించింది. అయితే ఐపీఎల్‌ 13వ సీజన్‌కు దూరంగా ఉన్న సురేశ్‌ రైనా మాత్రం సీఎస్‌కేతో కొనసాగనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా పలువురు ఆటగాళ్లను వదులుకుంటున్నట్లు ప్రకటించింది. ఇంగ్లండ్‌ ఆటగాడు జాసన్‌ రాయ్‌తో పాటు అలెక్స్‌ హేల్స్‌, భారత ఆటగాళ్లు సందీప్‌, మోహిత్‌ శర్మలకు గుడ్‌బై చెప్పనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రకటించింది.

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సక్సెస్ కావడంతో ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలాన్ని ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మినీ వేలం ఫిబ్రవరి 11న నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories