RR vs RCB: కోహ్లీ సెంచరీ వృథా... బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో నెగ్గిన రాజస్థాన్‌ రాయల్స్

Rajasthan Royals Beat Royal Challengers Bengaluru By 6 Wickets
x

RR vs RCB: కోహ్లీ సెంచరీ వృథా... బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో నెగ్గిన రాజస్థాన్‌ రాయల్స్

Highlights

RR vs RCB: కోహ్లీ సెంచరీ వృథా... సెంచరీతో రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చిన బట్లర్

RR vs RCB: ఐపీఎల్ తాజా సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 183 పరుగులు చేసింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ 113 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధికంగా 8 సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు. అయితే, లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసి విజయభేరి మోగించింది.

రాజస్థాన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుత సెంచరీతో మెరిశాడు. బట్లర్ కేవలం 58 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బట్లర్ చివరలో ఓ సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. బట్లర్ 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా... రాజస్థాన్ స్కోరు 183 పరుగులు. ఇంకొక్క పరుగు చేస్తే రాజస్థాన్ గెలుస్తుందనగా, బెంగళూరు బౌలర్ కామెరాన్ గ్రీన్ విసిరిన బంతిని బట్లర్ సిక్స్ గా మలిచాడు. ఐపీఎల్ లో బట్లర్ కు ఇది 100వ మ్యాచ్ కాగా, సెంచరీతో చిరస్మరణీయం చేసుకున్నాడు. బట్లర్ కు కెప్టెన్ సంజూ శాంసన్ నుంచి చక్కని సహకారం లభించింది. సంజూ శాంసన్ 42 బంతుల్లో 69 పరుగులు చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories