Sri Lanka Tour: టీమిండియా ప్రధాన కోచ్ గా ది వాల్

Rahul Dravid Head Coach India Cricket team
x

Rahul dravid

Highlights

Sri Lanka Tour: భార‌త జ‌ట్టుకు జూలైలో శ్రీలంక టూర్ ఫిక్స్ అయిన సంగ‌తి తెలిసిందే.

Sri Lanka Tour: భార‌త జ‌ట్టుకు జూలైలో శ్రీలంక టూర్ ఫిక్స్ అయిన సంగ‌తి తెలిసిందే. రెండు జ‌ట్ల మ‌ధ్య మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడ‌నున్నాయి. అయితే భార‌త అగ్ర‌శ్రేణి జ‌ట్టు ఇంగ్లాండ్ కు వెళ్ల‌నుంది. మ‌రో జ‌ట్టును శ్రీలంక టూర్ కు పంప‌నుంది బీసీసీఐ. కాగా..బీసీసీఐ చ‌రిత్ర‌లోనే తొలిసారి భార‌త జ‌ట్టును అగ్ర‌శ్రేణి, ద్వితీయ శ్రేణి జ‌ట్టులుగా చేసి టోర్నీ నిర్వ‌హిస్తుంది. మూడేళ్ల తరువాత టీం ఇండియా లంక పర్యటనకు వెళ్లనుంది.

ఇంగ్లండ్ టూర్ కు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ప్రధాన జట్టును పంపుతుంది బీసీసీఐ. జూన్ 18 నుంచి ఇంగ్లండ్ లో న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్, ఆపై ఇంగ్లండ్ జట్టుతో 5 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ మేరకు శ్రీలంక టూర్‌కి వెళ్లే టీం ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి అందుబాటులో ఉండడు., శ్రీలంక టూర్లో పాల్గొనే భారత జట్టుకు తాజాగా టీమిండియా మాజీ సార‌థి రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా నియమించింది. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి సమాచారం అందించారు.

రాహుల్ ద్రావిడ్ టీమిండియా ఏ జ‌ట్టుకు కొచ్ గా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ శిక్ష‌ణ‌లోనే శ్రేయ‌స్స్ అయ్యార్, శార్థుల్ ఠాగూర్, సుంద‌ర్, శ్రీరాజ్ వంటి ఆట‌గాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాక ద్రావిడ్ భారత అండర్-19 జట్లను సానబట్టడంలో నిమగ్నమయ్యాడు. ద్రావిడ్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు.

టీమిండియా త‌ర‌పున ద్రావిడ్ 344 వ‌న్డేలు 10,899 ఆడి ప‌రుగులు చేశాడు. 164 టెస్టుల్లో 13,288 ప‌రుగులు చేశాడు. ఒకే ఒక టీ20 మాత్ర‌మే ఆడాడు. వికెట్ కీప‌ర్, బ్యాట్స్ మెన్ గా రాణించాడు. భార‌త్ జ‌ట్టుకు ది వాల్ ఎన్నో గొప్ప విజ‌యాలు అందించాడు. 89 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు ద్ర‌విడ్. అండ‌ర్ 19 జ‌ట్టుకు కోచ్ గా వ్యవ‌హ‌రించిన అనుభ‌వం ఉండ‌డంతో బీసీసీఐ ద్ర‌విడ్ ను శ్రీలంకలో ప‌ర్య‌టించే జ‌ట్టుకు కోచ్ గా ఎంపిక చేసిన‌ట్లే తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories