IPL 2025: పాత జట్టు గూటికే.. ఐపీఎల్ ఛాంపియన్ టీంకు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్?

IPL 2025: పాత జట్టు గూటికే.. ఐపీఎల్ ఛాంపియన్ టీంకు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్?
x
Highlights

Rahul Dravid: భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ICC T20 ప్రపంచకప్ విజయంతో తన పదవీకాలం ముగిసింది.

Rahul Dravid: భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ICC T20 ప్రపంచకప్ విజయంతో తన పదవీకాలం ముగిసింది. ఈ టోర్నీ వరకు టీమ్ ఇండియాతో ఈ స్టార్ కాంట్రాక్ట్ ఉంది. ICC ODI వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత, అతని ఒప్పందాన్ని BCCI T20 ప్రపంచ కప్ వరకు పొడిగించింది. ఈ టోర్నీ తర్వాత టీమ్ ఇండియాకు గుడ్ బై చెప్పాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో కలిసి పని చేయవచ్చు. 2008లో ఆడిన తొలి ఐపీఎల్‌లో రాజస్థాన్ విజేతగా నిలిచింది.

రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు అభిమానులు తదుపరి ఎక్కడ పని చేస్తాడోనని సమాచారం కోరుకుంటున్నారు. ఈ స్టార్‌ ఇప్పుడు ఏ టీమ్‌తో కలిసి పనిచేస్తాడో తెలుసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కోచ్ లేదా మెంటర్‌గా తిరిగి రావచ్చు. అతను తన పాత జట్టు రాజస్థాన్ రాయల్స్‌లో చేరవచ్చు. ఈ జట్టు తరపున ఆడిన రాహుల్ ద్రవిడ్ చాలా కాలం పాటు ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా సేవలందించాడు. ప్రస్తుతం రాజస్థాన్ టీమ్‌తో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడవచ్చని నివేదికలో పేర్కొంది.

రాజస్థాన్‌తో రాహుల్ కెరీర్..

51 ఏళ్ల రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్‌తో కెప్టెన్‌గా ఆడాడు. 2013 ఛాంపియన్స్ లీగ్ T20 ఫైనల్‌కు జట్టును తీసుకెళ్లాడు ఈ దిగ్గజం. ద్రవిడ్ సారథ్యంలో రాజస్థాన్ జట్టు కూడా ప్లేఆఫ్‌కు చేరుకుంది. అతను 2014,2015 సంవత్సరాల్లో ఈ బృందంతో మెంటార్‌గా పనిచేశాడు. ఈ సీజన్‌లో భారత జట్టు మూడో స్థానం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories