PV Ramana: తైజు నెం.1 అని గుర్తు పెట్టుకోవాలి!

PV Ramana: తైజు నెం.1 అని గుర్తు పెట్టుకోవాలి!
x
Highlights

PV Ramana: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్‌లో భారత స్టార్ పీవీ సింధూ ఓటమి పాలవ్వడంపై ఆమె తండ్రి పీవీ రమణ స్పందించారు.

PV Ramana: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్‌లో భారత స్టార్ పీవీ సింధూ ఓటమి పాలవ్వడంపై ఆమె తండ్రి పీవీ రమణ స్పందించారు. ఒలింపిక్స్‌​ సెమీస్‌లో పీవీ సింధు గెలుపు కోసం వంద శాతం కృషి చేసిందని సింధు తండ్రి పీవీ రమణ తెలిపారు. అయితే సింధూ కంటే తైజూకు మెరుగైన రికార్డు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పీవీ సింధు అటాకింగ్ గేమ్ ఆడలేకపోయిందని ఓటమికి కారణాలను వివరించారు. సింధు ప్రత్యర్థి తైజూయింగ్‌ వరల్డ్ ఛాంపియన్, ఆమె చాలా వ్యూహాత్మకంగా ఆడింది అని రమణ తెలిపారు.

సింధు తొలి సెట్ గెలిచి వుంటే ఫలితం మరోలా వుండేదని రమణ పేర్కొన్నారు. సింధూకి నిన్న ప్లస్ అయిన నెట్ గేమ్ ఇవాళ మైనస్ అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సింధు కోచ్ మీద తమకు ఏ విధమైన అసంతృప్తి లేదని ఆయన చెప్పారు. సింధుకు అవకాశం ఇవ్వకుండా తైజు అటాక్ చేసిందని ఆయన అన్నారు. తైజూ ప్రపంచ నెం.1 అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువసేపు ర్యాలీలు ఆడకుండా తైజు జాగ్రత్తపడింది. సింధు రేపు బాగా ఆడి కాంస్యం సాధిస్తుందని భావిస్తున్నా అని రమణ ఆశాభావం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories