PV Sindhu: అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నా.. ఆసక్తికర విషయాలు చెప్పిన పీవీ సింధు..!

PV Sindhu Told Interesting Things About her Marriage and Career
x

PV Sindhu: అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నా.. ఆసక్తికర విషయాలు చెప్పిన పీవీ సింధు..!

Highlights

PV Sindhu: 2024 పారిస్ ఒలింపిక్స్‌ ముగియగానే పెళ్లి చేసుకోవాలని భావించామని, కానీ తీరిక లేని షెడ్యూల్‌ కారణంగా కుదరలేదని భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తెలిపారు.

PV Sindhu: 2024 పారిస్ ఒలింపిక్స్‌ ముగియగానే పెళ్లి చేసుకోవాలని భావించామని, కానీ తీరిక లేని షెడ్యూల్‌ కారణంగా కుదరలేదని భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తెలిపారు. నెల రోజుల ముందే పెళ్లి ఖాయం అయిందని, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉదయ్‌పుర్‌లో పెళ్లి వేడుకలు జరుగుతాయని చెప్పారు. వెంకట దత్త సాయి కుటుంబ స్నేహితుడని, కెరీర్ బిజీ కారణంగా చాలా తక్కువ సందర్భాల్లో మత్రమే ఇద్దరం కలిశామని సింధు చెప్పుకొచ్చారు. వివాహం తర్వాత కూడా ఆటను కొనసాగిస్తా అని, గాయాలకు దూరంగా ఉంటూ ఫిట్‌నెస్‌ కాపాడుకోవడమే తన లక్ష్యం అని హైదరాబాద్ బ్యాడ్మింటన్‌ ప్లేయర్ సింధు చెప్పారు.

హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయిని పీవీ సింధు పెళ్లి జరగనుంది. డిసెంబరు 22న ఉదయ్‌పుర్‌లో పెళ్లి జరగనుండగా.. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఉంటుంది. పెళ్లికి సమయం దగ్గరపడుతున్నా.. ఆమె ప్రాక్టీస్‌ మాత్రం ఆపలేదు. ఈ నెల 20 నుంచి సింధు పెళ్లి పనులు ఆరంభం అవుతాయి. పెళ్లి నిశ్చయం అయిన నేపథ్యంలో సింధు పలు విషయాలను పంచుకున్నారు. 'కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ, నాన్న కష్టం, మద్దతు కారణంగానే నేను ఈ స్థాయికి చేరుకున్నా. ఇపుడు వారి ఆశీస్సులతో పెళ్లి చేసుకోబోతున్నా. నా జీవితంలో ఇది అపురూపమైన సందర్భం' అని పీవీ సింధు అన్నారు.

'ఎప్పట్నుంచో మా రెండు కుటుంబాల మధ్య పరిచయం ఉంది. వెంకట్‌ సాయి కుటుంబ స్నేహితుడు. ఆయనకు తన కంపెనీ నిర్వహణలో బిజీగా ఉంటారు. నాకు బిజీ షెడ్యూల్‌ ఉంటుంది. అందుకే మేం ఇద్దరం చాలా తక్కువ సందర్భాల్లో కలిశాం. వెంకట్‌ బ్యాడ్మింటన్‌ ఆడరు కానీ.. నా మ్యాచ్‌లు చూస్తారు. అతడికి గేమ్స్ ఇష్టమే కానీ.. బిజినెస్ వైపు వెళ్లారు. వెంకట్ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్, డేటా సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. నిజానికి పారిస్ ఒలింపిక్స్‌ ముగియగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ బిజీ షెడ్యూల్‌ కారణంగా కుదరలేదు. 2025 జనవరి నుంచి టోర్నీలు జరుగుతాయి. అందుకే డిసెంబరు 22న పెళ్లి అనుకున్నాం. నెల రోజుల ముందే నా పెళ్లి నిశ్చయం అయింది. కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఉదయ్‌పుర్‌లో పెళ్లి జరుగుతుంది. 24న హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్‌కు అందరినీ ఆహ్వానిస్తాం' అని సింధు తెలిపారు.

'పెళ్లి తర్వాత కూడా బ్యాడ్మింటన్‌ కొనసాగిస్తా. గాయాలకు దూరంగా ఉంటూ.. ఫిట్‌నెస్‌ కాపాడుకోవడమే నాముందున్న లక్ష్యం. పెళ్లి ఖాయం అయ్యాక కూడా నేను ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టలేదు. ఈరోజు కూడా కూడా ప్రాక్టీస్ చేశా. ఉదయ్‌పుర్‌కు వెళ్లే వరకూ సాధన చేస్తా. పెళ్లయ్యాక కొన్ని రోజుల తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేస్తా. ఎందుకంటే జనవరి నుంచి కొత్త సీజన్‌ ఉంటుంది. వచ్చే సీజన్‌ నాకు ఎంతో కీలకం. ప్రధాన టోర్నీ అన్నింటిలో ఆడుతా. సయ్యద్‌ మోడీ సూపర్‌ 300 టైటిల్‌తో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఫిట్‌గా ఉంటే 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో కూడా ఆడతాను' అని సింధు తన భవిష్యత్ ప్రణళికలను వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories