PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కబోతున్న పీవీ సింధు..వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

PV Sindhu Wedding:  పెళ్లి పీటలెక్కబోతున్న పీవీ సింధు..వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
x
Highlights

PV Sindhu Wedding: భారత బ్యాడ్మింటర్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. ఈనెల 22న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఆమె పెళ్లి జరగనుంది. వరుడు...

PV Sindhu Wedding: భారత బ్యాడ్మింటర్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. ఈనెల 22న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఆమె పెళ్లి జరగనుంది. వరుడు హైదరాబాద్ కు చెందిన వెంకట దత్త సాయి అనే వ్యాపారవేత్తను పీవీ సింధు పెళ్లాడనుంది. ఈ విషయాన్ని ది హిందూ రిపోర్టు తెలిపింది.

29 ఏళ్ల భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది. రియో ఓలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన ఆమె..త్వరలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతోంది. రెండు సంవత్సరాల తర్వాత ఈ మధ్యే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన ఆమె ఇప్పుడు పెళ్లి రూపంలో మరో శుభవార్త తెలిపింది.

సింధు హైదరాబాద్ కు చెందిన వెంకట సాయి దత్తా అనే వ్యాపారవేత్తను మనువాడబోతోంది. ఆయన పోసిడెక్స్ టెక్నాలజీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. వీరిద్దరి వివాహం డిసెంబర్ 22న ఉదయ్ పూర్ లో జరగనుంది. డిసెంబర్ 20 నుంచే పెళ్లి పనులు షురూ కానున్నాయి. డిసెంబర్ 24న హైదరాబాద్ లో పెళ్ల రిసెప్షన్ విందు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన తర్వాత సింధు కొన్నాళ్లుగా రాణించలేపోతోంది. ఆదివారం జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సింగిల్స్ లో టైటిల్ గెలిచి మళ్లీ గెలుపుబాట పట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories