Paris Olympics 2024: పోరాడి ఓడిన పి.వి సింధు..పారిస్ ఒలింపిక్స్ లో ఓటమి

pv-sindhu-loses-to-he-bing-jiao-in-badminton-singles-paris-2024-olympics-TELUGU
x

Paris Olympics 2024: పోరాడి ఓడిన పి.వి సింధు..పారిస్ ఒలింపిక్స్ లో ఓటమి

Highlights

Paris Olympics 2024: పి.వి సింధు పోరాడి ఓడింది. రియోలో రజతం, టోక్కోలో కాంస్యం..పారిస్ లోనూ ఏదొక పతకం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని పెట్టుకున్న ఆశ నీరుగారింది. క్వార్టర్స్ కూడా చేరకుండానే సింధు నిష్క్రమించింది.

Paris Olympics 2024:పారిస్ ఒలింపిక్స్ లో ఏదొక పతకం సాధిస్తుందని పి.వి సింధుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి హ్యాట్రిక్ కొడుతుందని అంతా ఊహించారు. కానీ సింధు ఓడింది. పోరాడి ఓడింది. క్వార్టర్స్ చేరుకుండానే ఒలింపిక్స్ నుంచి ఇంటిబాటపట్టింది. గురువారం బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో ఆమె 19-21, 14-21తో చైనా క్రీడాకారిణి హే బిన్ జియావో చేతిలో ఘోరంగా ఓడింది. తొలిగేమ్ ను గెలిచే ఛాన్స్ సింధు చేజార్చుకుంది. ఆ తర్వాత ముందుకు సాగలేకపోయింది.

మ్యాచ్ ఆరంభంలో 1-5 తేడాతో వెనకబడ్డ సింధు..మళ్లి ఎంత ప్రయత్నించినా..ప్రత్యర్థి ఆమెకు ఆధిక్యం సాధించే ఛాన్స్ ఇవ్వలేదు. అయితే 19-19 స్కోరుతో సమం కావడంతో సింధకు మంచి ఛాన్స్ లభించింది. కానీ ప్రత్యర్థికి రెండు పాయింట్లు ఇచ్చింది. దీంతో గేమ్ ను కోల్పోవల్సి వచ్చింద. ఆధిక్యంలోకి వెళ్లిన ఆనందంలో బిన్ జియానో రెండో గేమ్ లో సత్తా చాటింది. 13-5 తో ఆధిక్యంతో దూసుకెళ్లింది. ఇక సింధు పుంచుకోవడం కష్టంగా మారింది. ప్రత్యర్థి అదే ఊపులో ఆడింది. ఈ దశలో సింధు మూడు పాయింట్లు సాధించినా..వెంటనే ప్రత్యర్థి రెండు పాయింట్లు గెలిచి మ్యాచ్ ను సొంతం చేసుకుంది. టోక్కోలో బిన్ జియావో ను ఓడించిన సింధు కాంస్యం గెలిచింది.



Show Full Article
Print Article
Next Story
More Stories