పీవీ సింధుకి ప్రశంసల వర్షం ...

పీవీ సింధుకి ప్రశంసల వర్షం ...
x
Highlights

పీవీ సింధు ప్రపంచ బ్యాడింటన్ క్రీడలో చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ను సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు క్రియేట్...

పీవీ సింధు ప్రపంచ బ్యాడింటన్ క్రీడలో చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ను సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో రెండు సార్లు గోల్డ్‌ ఛాన్స్ మిస్సయిన సిందు ఈ సారి సత్తా చాటింది. బంగారు పతకాన్ని సాధించింది.

స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ల సింధు విజేతగా అవతరించింది. గతంలో రెండు సార్లు ఫైనల్ చేరినా టైటిల్ నెగ్గడంలో విఫలమైన తెలుగుతేజం పీవీ సింధు మూడో ప్రయత్నంలో విజయకేతనం ఎగురవేసింది. ఫైనల్లో జపాన్ అమ్మాయి నజోమీ ఒకుహరపై వరుస గేముల్లో గెలిచింది. కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో సింధు 21-7, 21-7తో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో టైటిల్ నెగ్గిన తొలి భారత షట్లర్ గా రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకుంది

ఆట మొదలైన దగ్గర నుంచి సింధూ ఎక్కడా తడబడకుండా అదే దూకుడు ప్రదర్శించింది. ఫైనల్‌ ఫోబియాను అధిగమించి తన గేమ్‌ స్టాటజీస్‌తో ప్రత్యర్ధి ఒకుహరాను ముప్పతిప్పలు పెట్టింది. వరుస సెట్లలో గేమ్‌ సొంతం చేసుకుంది. ప్రపంచ విజేతగా అవతరించింది. దీంతో సింధు ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. చిరకాల స్వప్నాన్ని నెరవేర్చి బంగారు పతకాన్ని సాధించిన సింధూపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోడీ, క్రీడా మంత్రి కిరణ్ రిజ్జు, ఏపీ సీఎం జగన్‌, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింధును పొగడ్తలతో ముంచెత్తారు. ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories