Prasidh Krishna : మొదటి మ్యాచ్ లోనే రేర్ ఫీట్ సాధించిన ప్రసిద్ధ్ కృష్ణ.. క్రికెట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం

Prasidh Krishna : మొదటి మ్యాచ్ లోనే రేర్ ఫీట్ సాధించిన ప్రసిద్ధ్ కృష్ణ.. క్రికెట్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం
x
Highlights

Prasidh Krishna : భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే సిడ్నీ టెస్టులో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు ఆడే అవకాశం లభించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ...

Prasidh Krishna : భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే సిడ్నీ టెస్టులో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు ఆడే అవకాశం లభించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇది తన మొదటి మ్యాచ్. ఆకాశ్ దీప్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకున్నారు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో ప్రసిద్ధ్ కృష్ణ సక్సెస్ అయ్యాడు. సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీశాడు. అదే సమయంలో రెండో ఇన్నింగ్స్‌లోనూ తను మంచి ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను ఇంతకు ముందు ఏ బౌలర్ సాధించలేకపోయిన అద్వితీయ వికెట్‌ను కూడా తీశాడు.

సిడ్నీ టెస్టు మూడో రోజు తొలి సెషన్‌లో ప్రసిధ్ కృష్ణ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా తొలి మూడు వికెట్లు తీశాడు. అతను సామ్ కాన్‌స్టాంటాస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవ్ స్మిత్‌లను ఫెవీలియన్ కు పంపాడు. కానీ స్టీవ్ స్మిత్ వికెట్ అతనికి అత్యంత ప్రత్యేకమైనది. ఈ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 9 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి ప్రసిద్ధ్ కృష్ణకు బంతికి ఔటయ్యాడు. మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కూడా స్టీవ్‌ స్మిత్‌ను పెవిలియన్‌ బాట పట్టించింది ప్రసిధ్‌ కృష్ణనే.

సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే ఔట్ అయిన తర్వాత, స్టీవ్ స్మిత్ మరోసారి టెస్టులో తన 10,000 పరుగులను పూర్తి చేయడంలో ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు. స్టీవ్ స్మిత్ టెస్ట్‌లో 10 వేల పరుగుల మార్క్‌ను చేరుకోవడానికి ఇంకా 1 పరుగు అవసరం, దాని కోసం స్టీవ్ స్మిత్ ఇప్పుడు తదుపరి సిరీస్ వరకు వేచి ఉండాలి. అంటే, స్టీవ్ స్మిత్ 9999 వద్ద ఉన్నప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ అతని వికెట్ తీసి స్మిత్ నిరీక్షణను మరింత పెంచాడు. దీనితో 9999 టెస్ట్ కెరీర్‌లో బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసిన మొదటి బౌలర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ నిలిచాడు.

స్టీవ్ స్మిత్ కంటే ముందు, శ్రీలంక లెజెండ్ మహేల జయవర్ధనే కూడా 9999 టెస్ట్ కెరీర్‌లో ఔట్ అయ్యాడు. అతను రనౌట్ అయ్యాడు. ఏ బౌలర్ అతనిని అవుట్ చేయలేదు. కానీ స్టీవ్ స్మిత్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియా ఇప్పుడు శ్రీలంకతో 2-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడాల్సి ఉంది. స్టీవ్ స్మిత్ ఈ సిరీస్‌లో తన 10 వేల పరుగులను పూర్తి చేయాలనుకుంటున్నాడు. అతడి ఆశలపై ప్రసిధ్ కృష్ణ నీళ్లు చల్లాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories