PM Modi: వారణాసి క్రికెట్‌ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం

PM Modi Lays Foundation Stone Of Varanasi Cricket Stadium
x

PM Modi: వారణాసి క్రికెట్‌ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం

Highlights

Varanasi Cricket Stadium: ప్రధాని మోడీ వారణాసిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు.

Varanasi Cricket Stadium: ప్రధాని మోడీ వారణాసిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, టీమిండియా క్రికెట్ దిగ్గజాలు కపిల్‌దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ తదితరులు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా కూడా హాజరయ్యారు.

మహాదేవుడి నగరంలో నిర్మిస్తున్న ఈ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. కాశీలో ఉన్న క్రికెట్ ఔత్సాహికులకు ఈ స్టేడియం ఉపయోగపడుతుందన్నారు. పూర్వాంచల్ ప్రాంతం మొత్తానికి తారలా వెలుగొందుతుందన్నారు. ఈ సందర్భంగా ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెట్లు, క్రీడా జట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories