India FIDE Chess Olympiad Winner: 'ఫిడే' చెస్‌ ఒలంపియాడ్ విజేత‌గా భార‌త్.. ప్రధాని మోదీ అభినందన

India FIDE Chess Olympiad Winner:  ఫిడే చెస్‌ ఒలంపియాడ్ విజేత‌గా భార‌త్..  ప్రధాని మోదీ అభినందన
x

PM Modi congratulates chess players for winning FIDE Online Chess Olympiad

Highlights

India FIDE Chess Olympiad Winner: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) నిర్వహిచిన చెస్ ఒలంపియాడ్ లో భారత్ అనూహ్య విజయం సాధించింది. రష్యాతో కలిసి భారత్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ద‌క్కించుకుంది.

India FIDE Chess Olympiad Winner: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) నిర్వహిచిన చెస్ ఒలంపియాడ్ లో భారత్ అనూహ్య విజయం సాధించింది. రష్యాతో కలిసి భారత్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ద‌క్కించుకుంది. ఫైన‌ల్ భార‌త్, ర‌ష్యా మధ్య నువ్వా.. నేనా.. అన్న‌ట్టు ఆట సాగింది. చ‌ద‌రంగంలో ఉండే మాజా ఎంటో మ‌రో సారి తెలిసి వ‌చ్చింది. తొలుత ర‌ష్యాను విజేత‌గా ప్ర‌క‌టించారు. అయితే ఫైన‌ల్ రౌండ్‌లో స‌ర్వ‌ర్ డౌన్ అయ్యింద‌ని, ఇంట‌ర్‌నెట్ పోయింద‌ని భార‌త్ ఫిర్యాదు చేయ‌డంతో ఫ‌లితాన్ని మార్చారు. భార‌త్, ర‌ష్యాల‌ను ఉమ్మ‌డి విజేత‌గా ప్ర‌క‌టించారు. అన్ లైన్ ఫార్మ‌ట్‌లో పోటీని నిర్వ‌హించ‌డం ఇదే తొలిసారి క‌రోనా ప‌రిస్థితి ఈ నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్ ర‌ష్యాలు విజేతలుగా నిలిచాయి. ఫిడే చెస్ ఒలంపియాడ్‌లో 96 ఏళ్ల త‌రువాత‌ భారత్ స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

చెస్ ఒలింపియాడ్ ఫైనల్ మ్యాచ్ రెండవ రౌండ్‌లో భారత ఆటగాళ్ళు నిహాల్ సరీన్, దివ్య దేశ్‌ముఖ్ ఇంటర్నెట్ అంతరాయం కారణంగా తమ ఆటలతో సంబంధం కోల్పోయారు. ఆగస్టు 29న యుఎస్‌ఎను ఓడించి రష్యా జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది. మొదటి రౌండ్‌ను మినిమల్ మార్జిన్‌తో గెలవగా రెండవ మ్యాచ్‌ను డ్రా చేసి ఫైనల్‌లో తమ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్ ఇంటర్నెట్ అంతరాయం కారణంగా ఫిడే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా తెలుపుతూ ప్రపంచ ఛాంపియన్లుగా ప్రకటించింది.

చెస్.కామ్ అందించిన అన్ని ఆధారాలను అలాగే ఇంటర్నెట్ అంతరాయం గురించి ఇతర వనరుల నుండి సేకరించిన సమాచారాన్ని అప్పీల్స్ కమిటీ పరిశీలించిందన్నారు. వాటిన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తరువాత ఫిడే అధ్యక్షుడిగా తాను రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తూ బంగారు పతకాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ ఒలింపియాడ్‌లో ఆడిన భారత చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. రష్యా జట్టును అభినందించారు. తాము ఛాంపియన్స్ అన్నారు. రష్యాకు అభినందనలు తెలియజేశారు.

కాగా, భారత్‌కు ఫిడే ఒలింపియాడ్‌లో తొలిసారి స్వర్ణం అందించిన క్రీడాకారులను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. ఈ విజయం ఇతర ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపుతుందని ట్వీట్‌ చేశారు. భవిష్యత్‌లో చెస్‌ ఆటగాళ్లు మరిన్ని విజయాలు ఆందుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. భారత్‌తో కలిసి స్వర్ణం సాధించిన రష్యాకు చెందిన ఆటగాళ్లను సైతం మోదీ అభినందించారు. చెస్‌ ఒలింపియాడ్‌ బంగారు పతకం సాధించిన భారత బృందానికి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సైతం శుభాకాంక్షలు తెలిపారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తుందని ట్వీట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories