రౌడీయిజానికి ఇది పరాకాష్ట.. వారిపై కోహ్లీ సీరియస్

రౌడీయిజానికి ఇది పరాకాష్ట.. వారిపై కోహ్లీ సీరియస్
x

విరాట్ కోహ్లీ ఫైల్ ఫోటో 

Highlights

సిడ్నీవేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య టెస్టు జరుగుతున్న సందర్భంగా కొందరూ టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.

సిడ్నీవేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య టెస్టు జరుగుతున్న సందర్భంగా కొందరూ ఆసీస్ అభిమానులు టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఇవాళ్టి మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాడు సిరాజ్ ను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రేక్షకులు పలు మాటలు అన్నారు. దీంతో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. జాతివివక్ష దూషణల చేయడంపై సీరియస్ అయ్యాడు.

ఫీల్డింగ్ చేస్తుండగా జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఇలాంటి దూషణలకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. గతంలోనూ ఎన్నో నీచమైన ఉదంతాలు జరిగాయని... ఇప్పుడు జరిగిన ఘటనలు రౌడీ తరహా ప్రవర్తనకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి ఘటనలను ఎంతో తీవ్రమైనవిగా పరిగణించి, విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. మరోసారి ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠినశిక్షలు విధించాలని కోహ్లీ అన్నాడు.

కాగా., సిడ్నీ టెస్టులో జాతి వివక్ష కలకలం రేగడం పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) క్షమాపణలు కోరింది. తమ స్నేహితులైన భారత ఆటగాళ్లు తమను మన్నించాలని, ప్రేక్షకుల్లో కొందరి ప్రవర్తన పట్ల తాము చింతిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ కూడా దీనిపై దృష్టి సారించింది. వర్ణ వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదించాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు ఐసీసీ స్పష్టం చేసింది.

స్టాండ్స్‌లోని ప్రేక్షకులు కొంత మంది సిరాజ్‌ను ఉద్దేశించి ఏవో వ్యాఖ్యలు చేశారు. అతడు ఈ విషయాన్ని కెప్టెన్‌కు తెలియజేయడంతో.. రహానె మ్యాచ్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. దీంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. మూడోరోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఐతే బౌలర్లపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలు టీమిండియా దృష్టికి రావడంతో కెప్టెన్‌ అజింక్యా రహానే జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లైన అశ్విన్‌, రోహిత్‌ శర్మలతో కలిసి ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లతో పాటు మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేశాడు.


‍‍

Show Full Article
Print Article
Next Story
More Stories