క్రికెట్ కి వీడ్కోలు చెప్పిన పార్థివ్ పటేల్ !

క్రికెట్ కి వీడ్కోలు చెప్పిన పార్థివ్ పటేల్ !
x
Highlights

భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (35) క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధ‌వారం వెల్లడించాడు పార్థివ్ .

భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (35) క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధ‌వారం వెల్లడించాడు పార్థివ్ . 17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పార్థివ్.. యంగెస్ట్ వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు. మొత్తం తన కెరీర్ లో 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. ఇక గుజరాత్ తరపున 194 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పటేల్.. 2017లో సారథిగా గుజరాత్ టీంకు రంజీ ట్రోఫీ అందించాడు. ఐపీఎల్‌లో పార్థివ్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్ త‌ర‌ఫున ఆడుతున్నాడు.

ఈ 18 ఏళ్ల త‌న కెరీర్‌లో త‌న‌కు స‌హ‌క‌రించిన బీసీసీఐ, అంద‌రు కెప్టెన్ల‌కు, ఆటగాళ్ళకు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ.. ట్విట‌ర్‌లో ఓ లేఖ‌ను పోస్ట్ చేశాడు. కెరీర్ మొదట్లో పర్వాలేదనిపించిన పార్థివ్ పటేల్... ఆ తరవాత దినేష్ కార్తీక్, ధోనిల రాకతో పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యాడు. ఇక పార్థివ్‌ తన చివరి టెస్టు మ్యాచ్‌ను 2018లో దక్షిణాఫ్రికాతో ఆడగా, 2012లో ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories