Pakistan Vs England: కరోనా వేళ.. ఇంగ్లండ్‌ చేరిన పాక్ జట్టు ఇదే

Pakistan Vs England: కరోనా వేళ.. ఇంగ్లండ్‌ చేరిన పాక్ జట్టు ఇదే
x
Highlights

Pakistan Vs England: కరోనా వైరస్ భయాందోళనలు ఉన్నప్పటికీ పాక్ జట్టు ఇంగ్లండ్‌కు చేరుకుంది.

పాక్ జట్టుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం గమనార్హం. ఆ విమానంలోనే వెళ్లిన పాక్ జట్టు.. అక్కడికి చేరుకోగానే ప్రత్యేకంగా కేటాయించిన హోటల్‌లో టీమ్ అంతా 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటుంది. ఈ క్వారంటైన్ అనంతరం ఆటగాళ్లకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించి అందులో నెగటీవ్ వస్తే ప్రాక్టీస్ ప్రారంభిస్తారు.

ఇంగ్లండ్‌లాంటి పటిష్ట జట్టుతో ఆడటం గొప్పగా ఉంటుంది. ఎప్పటిలాగే అభిమానుల ఆశీస్సులు, ప్రార్థనలు మావెంటే ఉంటాయని నమ్ముతున్నా అని పేర్కొన్న బాబర్‌ విమానంలో తన సహచరులతో దిగిన ఫొటోను షేర్ చేశాడు.

పాకిస్థాన్ జట్టు 29 మంది ఆటగాళ్లను ఇంగ్లండ్‌కు పంపాలని పాక్ బోర్డు భావించింది. కానీ ఇదులో 10 మందికి 10 మంది క్రికెటర్లకు ముందు కరోనా పాజిటీవ్ వచ్చింది. మళ్లీ పరీక్షించగా అందులో ఆరుగురు ఫలితాలు నెగెటివ్‌గా వచ్చింది. దీంతో మరోమారు టెస్టులు నిర్వహించాకే ఈ 10 మందిని ఇంగ్లండ్‌కు పంపిస్తామని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. వారి హెల్త్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే కమర్షియల్ ఫ్లైట్‌లో ఇంగ్లండ్ చేరుకొని తమ టీమ్‌తో కలవచ్చని ఈసీబీ స్పష్టం చేసింది

ఇంగ్లాడు వెళ్ళిన పాక్ జట్టు ఇదే :

కెప్టెన్ బాబర్‌ ఆజమ్, అజహర్‌ అలీ, సర్ఫరాజ్‌ అహ్మద్, షహీన్‌ షా అఫ్రిది, అబిద్‌ అలీ, అసద్‌ షఫీఖ్, ఫహీమ్‌ అష్రఫ్, ఫవాద్‌ ఆలమ్,ఇమాముల్‌ హఖ్, ఖుష్‌దిల్‌ షా, మొహమ్మద్‌ అబ్బాస్, ఇఫ్తికార్‌ అహ్మద్, ఇమాద్‌ వసీమ్, మూసా ఖాన్, నసీమ్‌ షా, రోహైల్‌ నాజిర్, షాన్‌ మసూద్, సొహైల్‌ ఖాన్, ఉస్మాన్‌ షిన్వారీ, యాసిర్‌ షా.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories