పాక్ సెమిస్ ఆశలపై నీళ్ళు చల్లిన భారత్ , న్యూజిలాండ్ ..

పాక్ సెమిస్ ఆశలపై నీళ్ళు చల్లిన భారత్ , న్యూజిలాండ్ ..
x
Highlights

ప్రపంచ కప్ : - ఎన్నో ఆశలు పెట్టుకున్నారు,ఎన్నో దేవుళ్ళకు ప్రార్ధనలు చేసారు , దాయాది దేశం అయినప్పటికీ భారత్ గెలవాలని మొదటిసారిగా కోరుకున్నారు , కానీ...

ప్రపంచ కప్ : - ఎన్నో ఆశలు పెట్టుకున్నారు,ఎన్నో దేవుళ్ళకు ప్రార్ధనలు చేసారు , దాయాది దేశం అయినప్పటికీ భారత్ గెలవాలని మొదటిసారిగా కోరుకున్నారు , కానీ పాక్ అభిమానులకు నిరాశే మిగిల్చింది ఈ వరల్డ్ కప్ .. అ జట్టు సెమిస్ చేరాలంటే ఇంగ్లాండ్ మరియు ఇండియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓడిపోయి ఉంటే పాక్ సెమిస్ అవకాశాలు సజీవంగా ఉండేవి . అ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది . నిన్న ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సారి పాక్ మద్దతు న్యూజిలాండ్ జట్టుకు ఇచ్చింది. కానీ ఈ మ్యాచ్ లో కూడా ఇంగ్లాండే గెలిచింది . ఒకవేళ ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిచినా అ జట్టుకు సెమిస్ పై కొంతలో కొంత అయిన అవకాశం ఉండేది. కానీ అ రెండు మ్యాచ్ లో పాక్ మద్దతు ఇచ్చిన రెండు జట్లు ఓడిపోయాయి . దీనితో పాక్ టోర్నీ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది . ప్రస్తుతం పాక్ ఐదో స్థానంలో 9 పాయింట్లతో -0.792. రన్ రేట్ తో పాకిస్తాన్ ఉంది . పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ గెలిస్తే 11 పాయింట్లతో న్యూజిలాండ్ తో సమం అవుతుంది కానీ పాకిస్తాన్ కనీసం 316 పరుగుల తేడాతో గెలిస్తేనే అ జట్టుకు సెమిస్ అవకశాలు ఉన్నాయి . ఇది అసాధ్యం కాబట్టి పాకిస్తాన్ సెమిస్ ఆశలు గల్లంతు అయ్యాయనే చెప్పాలి ..

Show Full Article
Print Article
Next Story
More Stories