Pakistan: ఇదేందయ్యా.. ఆజామూ.. ఆడకుండానే టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ ఔట్..!

Pakistan Team Eliminated From T20 World Cup 2024
x

Pakistan: ఇదేందయ్యా.. ఆజామూ.. ఆడకుండానే టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ ఔట్..!

Highlights

T20 World Cup 2024: పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ ప్రచారం ముగిసింది. ఫ్లోరిడాలో జరగాల్సిన అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది.

T20 World Cup 2024: పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ ప్రచారం ముగిసింది. ఫ్లోరిడాలో జరగాల్సిన అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏపై ఓడిన పాక్ జట్టు రెండో మ్యాచ్‌లో టీమిండియాపైనా ఓటమిపాలైంది.

ఇక మూడో మ్యాచ్‌లో కెనడాపై విజయం సాధించి ఖాతా తెరిచింది. ఈ విజయంతో సూపర్-8 దశకు చేరుకోవాలనే కోరికను సజీవంగా ఉంచుకున్న పాక్ జట్టుకు వరుణుడు అడ్డుగా నిలిచాడు. అంటే, అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు గెలిస్తే.. పాకిస్థాన్ జట్టు తమ చివరి మ్యాచ్‌లో విజయం సాధించి సూపర్-8 దశకు చేరుకునే అవకాశం ఉంది.

కానీ, USA, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు. తద్వారా రెండు జట్లకు ఒక్కొక్క పాయింట్ కేటాయించారు. దీంతో అమెరికా జట్టు మొత్తం 5 పాయింట్లు సాధించి సూపర్-8 దశకు అర్హత సాధించింది.

గత మ్యాచ్‌లో కెనడాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు గెలిచినా కేవలం 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి, టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్ మ్యాచ్‌కు ముందే పాకిస్థాన్ జట్టు తప్పుకుంది.

పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షహీన్ షామాన్ అఫ్రిది ఖాన్

భారత్-అమెరికా రెండో రౌండ్: గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు ఇప్పటికే సూపర్-8 దశకు చేరుకుంది. ఇప్పుడు 5 పాయింట్లతో USA జట్టు కూడా తదుపరి దశలోకి ప్రవేశించింది. గ్రూప్-ఎలోని ఐర్లాండ్, కెనడా, పాకిస్థాన్ వంటి ఇతర జట్ల ప్రపంచకప్ ప్రచారం ముగిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories