Pakistan Pollution: పాక్‌లో వాయు కాలుష్యం.. ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలలో మార్పులు!

Pakistan Pollution:  పాక్‌లో వాయు కాలుష్యం.. ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలలో మార్పులు!
x
Highlights

Pakistan Pollution: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి - మార్చి మధ్య జరుగుతుంది. కానీ అంతకంటే ముందుగా...

Pakistan Pollution: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి - మార్చి మధ్య జరుగుతుంది. కానీ అంతకంటే ముందుగా పాకిస్తాన్‌లో కాలుష్యం విధ్వంసం సృష్టిస్తోంది. ప్రమాదకరమైన కాలుష్యం కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని మ్యాచ్‌లను ఇతర స్టేడియాలకు మార్చవలసి వచ్చింది. ముల్తాన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AIQ) 2000 కంటే ఎక్కువ నమోదైంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఇటీవల విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో పాకిస్థాన్‌లోని లాహోర్ మొదటి స్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో కాలుష్య బీభత్సం కనిపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని కొన్ని నగరాల వాయు నాణ్యత సూచిక 2000 కంటే ఎక్కువగా ఉంది. దీని వల్ల ఎవరికైనా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను దృష్టిలో ఉంచుకుని, క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీ (రంజీ ట్రోఫీని పోలిన పాకిస్థాన్ లీగ్) మ్యాచ్‌లు పంజాబ్ ప్రావిన్స్ నుండి ఇతర ప్రదేశాలకు మార్చారు. గ్రూప్ సి నాల్గవ రౌండ్ మ్యాచ్‌లు హరిపూర్, స్వాబి, మీర్పూర్ అనే మూడు వేర్వేరు వేదికలకు మార్చారు.

క్రికెట్ పాకిస్తాన్ నివేదిక ప్రకారం.. కరాచీ రీజియన్ బ్లూస్, డేరా మురాద్ జమాలీ మధ్య మ్యాచ్ మీర్పూర్‌లో జరుగుతుంది. స్వాబీలో సియాల్‌కోట్‌ రీజియన్‌, లాహోర్‌ రీజియన్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. చివరగా హరిపూర్‌లో క్వెట్టా రీజియన్, ఫాటా రీజియన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది కాకుండా, ముల్తాన్, షేక్‌పురా మిగిలిన మ్యాచ్‌లను కూడా ఇతర ప్రాంతాలకు మార్చారు. గత కొన్ని నెలలుగా పాకిస్థాన్‌లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. పంజాబ్‌లోని 10 జిల్లాలు నవంబర్ 8 నుండి 17 వరకు మూసివేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీపై మరింత ఆందోళన

వాయుకాలుష్యం కారణంగా పాకిస్థాన్ పరిస్థితి ఛాంపియన్స్ ట్రోఫీకి ఆందోళన కలిగిస్తోంది. అయితే టోర్నీ షెడ్యూల్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. దీంతో పాటు భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories