వన్డేలకు షోయబ్ మాలిక్ గుడ్ బై ...

వన్డేలకు షోయబ్ మాలిక్ గుడ్ బై ...
x
Highlights

పాకిస్తాన్ బాట్స్ మన్ షోయబ్ మాలిక్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు .. వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ పై తన చివరి లీగ్ మ్యాచ్ ఆడిన పాక్ ఈ మ్యాచ్ లో...

పాకిస్తాన్ బాట్స్ మన్ షోయబ్ మాలిక్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు .. వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ పై తన చివరి లీగ్ మ్యాచ్ ఆడిన పాక్ ఈ మ్యాచ్ లో నెగ్గింది . అనంతరం మాలిక్ తన రిటైర్మెంట్ ని ప్రకటించాడు.. 1999 తన మొదటి వన్డే మ్యాచ్ ని వెస్టిండిస్ పై ఆడిన షోయబ్ మాలిక్ మొత్తం 9 సెంచరీలు చేసాడు . 44 హాఫ్ సెంచరీలు చేసాడు.. బౌలర్ గా 158 వికెట్లను తీసాడు .. మొత్తం ఇప్పటివరకు 287 వన్డేలు ఆడిన మాలిక్ 7534 పరుగులు చేసాడు ... తన చివరి మ్యాచ్ ని భారత్ తోనే ఆడాడు ..

సీనియారిటీ వల్లే జట్టులో చోటు ..

షోయబ్ మాలిక్ పెద్దగా ఫార్మ్ లో లేనప్పటికీ అతన్ని సెలెక్టర్లు ప్రపంచ కప్ కి ఎంపీక చేసారు . కేవలం సీనియారిటీ అనే ట్యాగ్ లైన్ తోనే షోయబ్ మాలిక్ ఎంపీక అయ్యాడు . అతని సూచనలు జట్టుకు ఎంతో ఉపయోగపడుతాయని పీసీబి భావించింది . అయితే అది కాస్తా బెడిసి కొట్టింది . మాలిక్ వల్ల పాక్ జట్టుకు ఒరిగింది అయితే ఏమి లేదనే చెప్పాలి .. ప్రపంచ కప్ లో మాలిక్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు .. ఈ వరల్డ్ కప్ లో మొత్తం మూడు మ్యాచ్ లు ఆడిన మాలిక్ మొత్తం ఎనమిది పరుగులు చేసాడు .. అందులో రెండు డకౌట్లు ఉన్నాయి .. కాగా ఇప్పటికే మాలిక్ తన టెస్ట్ క్రికెట్ కి కూడా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories