Australian Open: విజేత అతడే..

Novak Djokovic Clinches 9th Australian Open
x

Novak Djokovic ఫోటో హన్స్ ఇండియా 

Highlights

Australian Open: వరల్డ్ నంబర్ వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో తన సత్తాను మరోసారి చాటాడు. తన ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తూ మరోసారి...

Australian Open: వరల్డ్ నంబర్ వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో తన సత్తాను మరోసారి చాటాడు. తన ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తూ మరోసారి గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో మెద్వెదెవ్‌తో జరిగిన ఫైనల్లో 7-6, 6-2, 6-2 తేడాతో గెలుపొందాడు. తొలిసెట్‌ హోరాహోరీగా సాగినా.. తర్వాతి రెండు సెట్లలో జకోవిచ్ ‌ పైచేయి సాధించాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో మూడు ఏస్‌లు సంధించిన అతడు.. 20 విన్నర్లు కొట్టి ప్రత్యర్థిపై సత్తా చాటాడు.

నోవాక్ జోకోవిచ్‌ (Novak Djokovic) ఆస్ట్రేలియా ఓపెన్‌ గెలవడం ఇది తొమ్మిదోసారి. కాగా, తన కెరీర్‌లో ఇది 18వ గ్రాండ్‌స్లామ్‌. వరుసగా గత మూడుసార్లు ఈ టైటిల్‌ను అందుకోవడమేకాక, అతడు ఆడిన అన్ని ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్స్‌లోనూ విజయం సాధించడం మరో విశేషం. మరోవైపు ఆల్‌టైమ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల (20) జాబితాలో ఫెదరర్, నాదల్ సరసన చేరడానికి మరో రెండు టైటిళ్ల దూరంలో ఉన్నాడు జకోవిచ్.

Show Full Article
Print Article
Next Story
More Stories