Pakisan Cricket: షాకింగ్ న్యూస్.. దివాలా తీసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్..! నెలల తరబడి క్రికెటర్లకు నో శాలరీస్..!

No Salaries for Pakistan Cricketers Reveals Shocking Truth About Pakistan Cricket Board
x

Pakisan Cricket: షాకింగ్ న్యూస్.. దివాలా తీసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్..! నెలల తరబడి క్రికెటర్లకు నో శాలరీస్..!

Highlights

Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో కలకలం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మరో కీలక వార్త బయటకు వచ్చింది.

Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో కలకలం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మరో కీలక వార్త బయటకు వచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకుంది. నిజానికి పాక్ క్రికెటర్లకు నెలరోజుల జీతం ఇవ్వలేదని ఓ నివేదిక వెల్లడించింది. చెల్లింపులో జాప్యం ఆర్థిక నిర్వహణ, స్థిరత్వంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈక్రమంలో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న బాబర్ ఆజం ప్రకటించిన సంగతి తెలిసిందే.

జులై నుంచి జీతాలు చెల్లించలేదు..

వాస్తవానికి, క్రికెట్ పాకిస్తాన్ నివేదిక ప్రకారం, ఆటగాళ్లకు జులై నుంచి అక్టోబర్ 2024 వరకు జీతాలు చెల్లించలేదు. షహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం వంటి చాలా మంది స్టార్ క్రికెటర్లు చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల ప్రభావితమయ్యారు. PCBకి పదేపదే రిమైండర్‌లు చేసినప్పటికీ, ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. పీసీబీ ఈ ప్రవర్తన ఆటగాళ్లలో టెన్షన్‌ను పెంచింది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దివాలా తీసిందా..?

ఓ పాకిస్థానీ క్రికెటర్ మాట్లాడుతూ, 'మేం ఓపికగా ఉన్నాం. కానీ, తదుపరి చెల్లింపు ఎప్పుడు వస్తుందో మీకు తెలియనప్పుడు, ఆటపై దృష్టి పెట్టడం కష్టం' అంటూ చెప్పుకొచ్చాడు. బోర్డు ఆర్థిక సవాళ్లు ఆటగాళ్లకు జీతాలు చెల్లించకపోవడమే కాకుండా ఆటగాళ్ల జెర్సీలపై ఉన్న స్పాన్సర్‌షిప్ లోగోకు సంబంధించిన బకాయి మొత్తాన్ని కూడా చెల్లించలేదంట. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి ప్రస్తుతం కటిక పేదరికం వైపు చూపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories