Nitish Kumar Reddy: దేశానికి మీరు డైమండ్‌ను ఇచ్చారు.. నితీష్ కుమార్ రెడ్డి తండ్రితో గవాస్కర్

Nitish Kumar Reddy: దేశానికి మీరు డైమండ్‌ను ఇచ్చారు.. నితీష్ కుమార్ రెడ్డి తండ్రితో గవాస్కర్
x
Highlights

Nitish Kumar Reddy's Family: నితీష్ కుమార్ కుమార్ రెడ్డి తండ్రి సునీల్ గవాస్కర్ పాదాలను తాకినట్లు మెల్బోర్న్ నుండి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో...

Nitish Kumar Reddy's Family: నితీష్ కుమార్ కుమార్ రెడ్డి తండ్రి సునీల్ గవాస్కర్ పాదాలను తాకినట్లు మెల్బోర్న్ నుండి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో మెల్‌బోర్న్‌లో నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం గవాస్కర్‌‌ను కలిసినప్పటి దృశ్యం . ఈ సందర్భంగా నితీష్ తండ్రి భావోద్వేగానికి లోనై గవాస్కర్‌ను కౌగిలించుకోకుండా ఆయన పాదాలను తాకి నమస్కరించారు. నితీష్ తండ్రి తన గవాస్కర్‌కు నితీష్ గురించి వివరించడం కనిపించింది. అతను భారత క్రికెట్ జట్టుకు దొరికిన వజ్రం అని గవాస్కర్ తెలిపారు.

నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి సునీల్ గవాస్కర్ పాదాలను తాకి నమస్కరించారు. తండ్రిలాగే నితీష్ రెడ్డి సోదరి కూడా సునీల్ గవాస్కర్ పాదాలకు నమస్కరించింది. నితీష్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో సునీల్ గవాస్కర్ అతని బ్యాటింగ్ గురించి మాట్లాడారు. "సునీల్ గవాస్కర్ ఒక వజ్రం" అని చెబుతూ మీరు దేశానికి వజ్రాన్ని ఇచ్చారు అని నితీష్‌ను, ఆయన తల్లిదండ్రులను ఆకాశానికెత్తారు.

నితీష్ రెడ్డి 189 బంతుల్లో 114 పరుగులు

మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నితీష్ రెడ్డి 189 బంతులు ఎదుర్కొని 114 పరుగులు చేశాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 8వ ర్యాంక్‌లో ఆడిన నితీష్‌ రెడ్డి ఈ ఇన్నింగ్స్‌ను టెస్టు చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా పలువురు క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

8వ స్థానంలో రెండో పెద్ద ఇన్నింగ్స్

మెల్‌బోర్న్‌లో నితీష్‌ ఇన్నింగ్స్‌ భారత టెస్టు చరిత్రలో 8వ నంబర్‌ బ్యాట్స్‌మెన్‌ చేసిన రెండో అత్యధిక ఇన్నింగ్స్‌. అంతకుముందు 2002లో వెస్టిండీస్‌పై అజయ్ రాత్రా అజేయంగా 115 పరుగులు చేశాడు. మెల్‌బోర్న్‌లో సాధించిన సెంచరీని నితీష్ కుమార్ రెడ్డి తన తండ్రి ముత్యాల రెడ్డికి ( Nitish Kumar Reddy's Father Muthyala Reddy) అంకితమిచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories