2021 ఐపీఎల్‌ ఈసారి ఇంకాస్త కొత్తగా

2021 ఐపీఎల్‌ ఈసారి ఇంకాస్త కొత్తగా
x
Highlights

క్రేజ్ కా బాప్ అన్నట్లుగా ఉంటుంది ఐపీఎల్ ! 8 జట్లు ఆడితేనే ఈ రేంజ్ ఉత్సాహం ఉందంటే ఆ నంబర్ పది అయితే ! ఊహించుకుంటేనే అదుర్స్ అనిపిస్తుంది కదా !...

క్రేజ్ కా బాప్ అన్నట్లుగా ఉంటుంది ఐపీఎల్ ! 8 జట్లు ఆడితేనే ఈ రేంజ్ ఉత్సాహం ఉందంటే ఆ నంబర్ పది అయితే ! ఊహించుకుంటేనే అదుర్స్ అనిపిస్తుంది కదా ! నెక్ట్స్ సీజన్ నుంచి అదే జరగబోతోంది మరి ! ఐతే ఈసారి టోర్నీ ఇంకాస్త కొత్తగా అనిపించబోతుందట. ఇంతకీ ఏంటి స్పెషాలిటీస్ ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాసుల వర్షం కురిపించింది బీసీసీఐకి ! ప్రతీ సీజన్‌కు ఏదో ఒక మార్పు కనిపిస్తుంటుంది టోర్నీలో ! 2021 నుంచి మాత్రం అంతకుమించి అనిపించబోతుందట సీన్. 2021సీజన్‌ సరికొత్త ఫార్మాట్‌లో జరగనుందని తెలుస్తోంది. కొత్తగా రెండు జట్లను తీసుకొచ్చేందుకు ఇప్పటికే బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఐతే ఈ రెండు కూడా చేరాక మొత్తం పది జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేసి లీగ్‌ దశలో మ్యాచ్‌లు నిర్వహిస్తారని తెలుస్తోంది. టోర్నీ నిడివి పెరగకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నారని లీగ్‌ వర్గాలు చెప్తున్నాయ్.

నిజానికి ఐపీఎల్‌లో తొమ్మిదో జట్టు వస్తుందని అంతా అనుకున్నారు. ఐతే బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం అజెండా రాగానే పదవ టీమ్ కూడా ఉంటుందని తెలిసింది. అదానీ, గోయెంకా గ్రూప్స్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తికరంగా ఉన్నాయ్. దీంతో వచ్చే సీజన్‌ 10జట్లతో జరగడం ఖాయంగానే కనిపిస్తోంది. 2011లోనూ లీగులో 10 జట్లు తలపడ్డాయ్. ఆ తర్వాత రెండేళ్లు 9జట్లు ఆడాయి. దీంతో అప్పటి మోడల్ మళ్లీ వచ్చే ఐపీఎల్‌లో ప్రవేశపెట్టాలని బీసీసీఐ ఆలోచన చేస్తోందని తెలుస్తోంది.

మొత్తం జట్లను రెండు గ్రూపులుగా విభజించినా ఒక్కో జట్టు 14మ్యాచులే ఆడుతుంది. ఒక మ్యాచ్ హౌం గ్రౌండ్‌లో ఆడితే మరొకటి అప్పొనెంట్ మైదానంలో ఆడుతుంది. ఎక్కువ పాయింట్లు వచ్చిన నాలుగు టీమ్‌లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయ్. జట్లను విడదీసేందుకు డ్రా తీస్తారు. పది జట్లు అవ్వడంతో బీసీసీఐ భారీవేలం నిర్వహించక తప్పదు. ఇక అటు డిసెంబర్ 24న బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం జరగనుండగా పది జట్ల అంశంతో పాటు పలు కీలక విషయాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories