Neeraj Chopra: మరోసారి సత్తాచాటిన నీరజ్ చోప్రా..లుసానె డైమెండ్ లీగ్‎లో రెండో స్థానం

Neeraj Chopra Diamond League 2024 Final Neeraj Chopra misses Diamond Trophy by agonising 1cm, finishes 2nd in javelin final
x

Neeraj Chopra: డైమండ్ లీగ్ 2024 ఫైనల్లో సెంటీమీటర్ తేడాతో ట్రోఫీని కోల్పోయిన నీరజ్ చోప్రా

Highlights

Lausanne Diamond League : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటాడు.లుసానె డైమండ్ లీగ్ 89.49 ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచాడు.

Lausanne Diamond League Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి తన అద్భుత ప్రదర్శనను ప్రదర్శించాడు. తాజాగా జరిగిన లుసానె డైమండ్ లీగ్ రెండో స్థానంలో నిలిచాడు. 89.49 మీటర్ల ఈటెను విసిరిన నీరజ్ ఈ సీజన్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అయితే ఎప్పటి లాగే ఈసారి కూడా నీరజ్ 90 మీటర్ల కల మాత్రం నెలవేరలేదు. గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 90.61 మీటర్ల ఈటెను విసిరి ఈ లుసానై డైమండ్ లీగ్ లో మొదటి స్థానంలో నిలిచాడు. జర్మన్ అథ్లెట్ వెబర్ జులియన్ 87.08 మీటర్లతో మూడోస్థానంలో నిలిచారు.

మొదటి త్రో 82.10 మీటర్లు. తొలి ప్రయత్నంలోనే మూడో స్థానంలో నిలిచాడు. కాగా, గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ 86.36 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలవగా, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 85.07 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. రెండో రౌండ్‌లో నీరజ్ కాస్త మెరుగ్గా రాణించి 83.21 మీటర్లు విసిరినా అగ్రస్థానానికి చేరుకోలేకపోయాడు.88.49 మీటర్ల భారీ త్రోతో అగ్రస్థానంలో నిలిచాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ కూడా అతనికి 87.08 మీటర్లు విసిరి గట్టి పోటీని ఇచ్చేందుకు ప్రయత్నించగా, నీరజ్ మూడో రౌండ్‌లో 83.13 మీటర్లు విసిరాడు. ఇక్కడ ఉక్రెయిన్‌కు చెందిన ఆర్తుర్ ఫెల్నర్ 83.38 మీటర్ల త్రోతో నీరజ్‌ను నాలుగో స్థానానికి నెట్టాడు.

నీరజ్ నాల్గవ త్రో 82.34 మీటర్లు విసిరాడు. మెరుగైన ప్రదర్శనను కొనసాగించలేకపోయాడు. అయితే 5వ రౌండ్ త్రోలో నీరజ్ 85.58 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. చివరికి నీరజ్ అద్భుతాలు చేసి రెండో స్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రా రాబోయే రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉంటాడని సమాచారం. అతనికి శస్త్రచికిత్స కూడా చేసే అవకాశం ఉంది. గాయం కారణంగా తాను అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయానని పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా చెప్పిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories