Paris Olympics 2024: జావెలిన్ త్రోలో భారత్ కు రజతం..చరిత్ర స్రుష్టించిన బల్లెం వీరుడు

Neeraj Chopra created history by winning silver in Paris Olympics 2024
x

Paris Olympics 2024:జావెలిన్ త్రోలో భారత్ కు రజతం..చరిత్ర స్రుష్టించిన బల్లెం వీరుడు

Highlights

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 5 పతకాలు సాధించింది. పోటీలో 13వ రోజు దేశానికి 2 పతకాలు వచ్చాయి. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం సాధించాడు. హాకీ జట్టు కాంస్యం సాధించింది.స్టార్ అథ్లెట్ నీర్జ చోప్రా జావెలిన్ త్రోలో రెండో స్థానంలో నిలిచి భారత్ కు సిల్వర్ పతకం తెచ్చాడు.

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ 2024లో 13వ రోజు (ఆగస్టు 8) భారతదేశానికి మిశ్రమ ఈవెంట్. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం చేజార్చుకున్నాడు. జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరి రజత పతకం సాధించాడు. కాగా, పాకిస్థాన్‌ ఆటగాడు అర్షద్‌ నదీమ్‌ ఒలింపిక్‌ రికార్డు (92.97 మీటర్లు)తో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.గురువారం అర్థరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్ లో నీరజ్ రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్ల వరకు విసిరాడు. దీంతో మొత్తం 12మంది పోటీ పడ్డ ఫైనల్లో మ్యాచులో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ అర్షద్ 92.97 మీటర్లు విసిరి స్వర్ణం గెలించాడు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్ 88.54 మీటర్లు విసిరి కాంస్యం వచ్చింది.

ఫైనల్లో మొత్తం 6 ప్రయత్నాల్లో నీరజ్ కేవలం రెండో త్రోలోనే మాత్రమే సఫలం అయ్యాడు. మిగతా అన్ని ప్రయత్నాల్లోనూ విఫలం అయ్యాడు. పాక్ ఆటగాడు అర్హద్ రెండుసార్లు 90 మీటర్ల కంటే ఎక్కువను ఈటెను విసిరి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు భారత్ మొత్తం 5 పతకాలను సాధించింది. వీటిలో తొలి సిల్వర్ మెడల్ నీరజ్ దే కావడం విశేషం. మిగతా వాటిలో షూటింగ్ లో మూడు, హకీలో ఒకటి రాగా..వన్నీ కాంస్య పతకాలే. నీరజ్ స్వర్ణం గెలుస్తాడని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ రెండో స్థానంతో సంత్రుప్తి పడాల్సి వచ్చింది.


Show Full Article
Print Article
Next Story
More Stories