యూఎస్‌‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత ఒసాకా

యూఎస్‌‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత ఒసాకా
x
Highlights

జపాన్ కు చెందిన నవోమి ఒసాకా 26 సంవత్సరాల వయసులో యుఎస్ ఓపెన్ ఫైనల్ గెలిచిన మొదటి మహిళల..

జపాన్ కు చెందిన నవోమి ఒసాకా 26 సంవత్సరాల వయసులో యుఎస్ ఓపెన్ ఫైనల్ గెలిచిన మొదటి మహిళల టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచింది. యుఎస్ ఓపెన్ 2020 మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచిన ఒసాకా 1-6, 6-3, 6-3తో మాజీ ప్రపంచ నంబర్ విక్టోరియా అజెంకాను ఓడించింది. తొలి సెట్‌ను ఒసాకా కోల్పోయినప్పటికీ మిగతా రెండు సెట్లలో ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా బరిలో నిలిచి టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పటి వరకు ఒసాకా మూడు గ్రాండ్‌ స్లామ్‌లు గెలుచుకోగా..

అందులో రెండు యూఎస్‌ ఓపెన్‌ కావడం విశేషం. 2018లోనూ ఒసాకా యూఎస్‌ ఓపెన్‌ను గెలుచుకుంది. 2019లో కూడా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది. కాగా గతంలో సెరెనా విలియమ్స్‌తో జరిగిన సెమీస్‌లో అజరెంకా ఇదే తరహాలో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. అప్పుడు తొలి సెట్‌ను 1-6 తేడాతో కోల్పోయిన అజరెంకా.. మిగతా రెండు సెట్లను 6-3, 6-3 తేడాతో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. ఇప్పుడు అజరెంకా కూడా ఇలాగే ఓటమి చెందడం చెప్పుకోదగ్గ విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories