T20 World Cup: 2 బంతులు, 2 వికెట్లు.. తొలి ఓవర్‌లోనే ప్రపంచకప్‌లో సంచలనం.. చరిత్ర సృష్టించిన బౌలర్ ఎవరో తెలుసా?

Namibia Bowler Ruben Trumpelmann Wicket on First Ball in T20 World Cup Twice and Created Histor
x

T20 World Cup: 2 బంతులు, 2 వికెట్లు.. తొలి ఓవర్‌లోనే ప్రపంచకప్‌లో సంచలనం.. చరిత్ర సృష్టించిన బౌలర్ ఎవరో తెలుసా?

Highlights

Ruben Trumpelmann: ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు ఆటలో రెండు ఆతిథ్య జట్లు విజయాన్ని నమోదు చేసుకున్నాయి.

Ruben Trumpelmann: ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు ఆటలో రెండు ఆతిథ్య జట్లు విజయాన్ని నమోదు చేసుకున్నాయి. రెండో రోజు తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై నమీబియా అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు 20 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. రూబెన్ ట్రంపెల్‌మన్ డేంజరస్ బౌలింగ్ ముందు ఓమన్ బ్యాట్స్‌మెన్స్ నిస్సహాయంగా కనిపించారు. అంతకుముందు వన్డే ప్రపంచకప్‌లోనూ తొలి బంతికే వికెట్‌ తీసి అద్భుతం చేశాడు.

పెద్ద జట్లతో ఆడిన అనుభవం ఉన్న నమీబియా జట్టు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్‌లో ఒమన్ జట్టును కేవలం 109 పరుగులకే పరిమితం చేసింది. టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. స్టార్ బౌలర్ ట్రంపెల్‌మన్ మొదటి రెండు బంతుల్లో వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ముందుగా కశ్యప్ ప్రజాపతిని, ఆ తర్వాత కెప్టెన్ ఆకిబ్ ఇలియాస్‌ను పెవిలియన్ చేర్చాడు. ఇంత ప్రమాదకరమైన ఓవర్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ద్వారా, ఈ బౌలర్ మొత్తం జట్టును ప్రమాదంలో పడేశాడు.

పొడవాటి జుట్టు ఉన్న ఈ బౌలర్ ఎవరు?

నమీబియా ఫాస్ట్ బౌలర్ రూబెన్ ట్రంపెల్‌మాన్ ICC T20 వరల్డ్ కప్ 2024లో తన మొదటి ఓవర్‌లోనే వరుసగా రెండు బంతుల్లో వికెట్లు తీశాడు. ఈ 26 ఏళ్ల బౌలర్ దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించాడు. నమీబియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు.

చరిత్ర సృష్టించిన ట్రంపెల్‌మన్..

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలి ఓవర్ తొలి రెండు బంతుల్లోనే వికెట్ తీసిన నమీబియా తరపున తొలి బౌలర్‌గా ట్రంపెల్‌మన్ నిలిచాడు. ఇంతకు ముందు ఈ టోర్నీలో ఏ బౌలర్ కూడా ఈ ఘనత సాధించలేదు. అంతేకాదు, టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌‌గా నిలిచాడు. 2021 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన తొలి బంతికే ట్రంపెల్‌మన్ వికెట్ తీశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories