40 ఏళ్ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఇండియాలో ఐఓసీ స‌మావేశం

Mumbai to host the 2023 International Olympics Committee Session
x

40 ఏళ్ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఇండియాలో ఐఓసీ స‌మావేశం

Highlights

Mumbai: వచ్చే ఏడాది ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ 2023 సెషన్‌ నిర్వహించేందుకు భారత్‌ హక్కులు దక్కించుకుంది.

Mumbai: వచ్చే ఏడాది ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ 2023 సెషన్‌ నిర్వహించేందుకు భారత్‌ హక్కులు దక్కించుకుంది. దీంతో 40 ఏళ్ల తర్వాత మనకు ఆ గౌరవం లభించింది. 1983లో చివరిసారి ఢిల్లీలో ఈ IOC సెషన్‌ నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు భారత్‌ ఆ విశిష్ట సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రస్తుతం బీజింగ్‌లో జరుగుతున్న 139వ IOC సెషన్‌లో భారత బృందం ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ సభ్యులకు ఓ ప్రెజెంటేషన్‌ ఇచ్చి ఒప్పించింది. ఇందులో 2008 ఒలింపిక్స్‌ బంగారు పతక విజేత అభినవ్‌బింద్రాతో పాటు IOC సభ్యురాలు నీతా అంబానీ, భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరిందర్‌ బాట్రా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో భారత్‌లో ఒలింపిక్స్‌ క్రీడలు నిర్వహించడం మన కల అన్నారు నీతా అంబానీ.

కాగా, ఈ విషయం పట్ల ఐఓసీ సభ్యురాలు, రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల తర్వాత భారత్‌కు అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ సమావేశం నిర్వహించే అదృష్టం దక్కిందని, దీంతో భారత్‌లోని యువత ఈ ఒలింపిక్స్‌ విశేషాలను తెలుసుకునేందుకు చక్కటి అవకాశం లభించిందని ఆమె అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో మన దేశంలో ఒలింపిక్స్‌ క్రీడలు నిర్వహించడం మన కల అని ఆమె పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories