WPL 2023: ఎదురులేని ముంబై ఇండియన్స్‌.. వరుసగా ఐదో విజయం

Mumbai Indians Women Beat Gujarat Giants by 55 Runs
x

WPL 2023: ఎదురులేని ముంబై ఇండియన్స్‌.. వరుసగా ఐదో విజయం

Highlights

WPL 2023: WPL 2023: ఎదురులేని ముంబై ఇండియన్స్‌.. వరుసగా ఐదో విజయం

WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో ముంబై వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 55 పరుగుల తేడాతో నెగ్గి పాంచ్ పటాకా మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

ముంబై బౌలర్లలో నాట్ షివర్ 3, హేలీ మాథ్యూస్ 3, అమేలియా కెర్ 2, ఇస్సీ వాంగ్ ఒక వికెట్ తీసి గుజరాత్‌ను దెబ్బకొట్టారు. గుజరాత్ జట్టులో హర్లీన్ డియోల్ 22, కెప్టెన్ స్నేహ్ రాణా 20 పరుగులు చేశారు. WPLలో ముంబై ఇండియన్స్ జట్టు తానాడిన ఐదు మ్యాచుల్లోనూ నెగ్గి ఓటమన్నదే ఎరుగకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories