MS Dhoni: IPL 2025పై కీలక అప్డేట్ ఇచ్చిన జార్ఖండ్ డైనమైట్..!

MS Dhoni Will Play in IPL 2025 key Update Gives CSK Player Dhoni
x

MS Dhoni: IPL 2025పై కీలక అప్డేట్ ఇచ్చిన జార్ఖండ్ డైనమైట్..!

Highlights

MS Dhoni: భారత వెటరన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటంపై తన మౌనాన్ని వీడాడు.

MS Dhoni: భారత వెటరన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటంపై తన మౌనాన్ని వీడాడు. తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ అతనిని కొనసాగించాలని కోరుకుంటుంది. ధోని కెప్టెన్సీలో జట్టు అత్యధికంగా 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్‌ విజేతగా ముంబై ఇండియన్స్‌తో పాటు చెన్నై జట్టు అగ్రస్థానంలో ఉంది. గత సీజన్‌కు ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించింది.

ధోనీ 2025లో ఐపీఎల్‌లో ఆడడంతోపాటు ఆ తర్వాత కూడా కొనసాగుతానంటూ హింట్ ఇచ్చాడు. 43 ఏళ్ల ఈ ఆటగాడు భవిష్యత్తుకు సంబంధించిన అన్ని పుకార్లకు చెక్ పేట్టేశాడని తెలుస్తోంది. రాబోయే కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడేందుకు ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలని స్వయంగా చెప్పడంతో.. ఇప్పటి వరకు వస్తోన్న రూమర్స్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడనిపిస్తోంది. ధోని IPL 2025 కోసం మాత్రమే కాకుండా, మెగా వేలం తర్వాత మొత్తం మూడు ఏళ్ల కోసం CSK ప్రణాళికలలో ఉన్నాడని తెలుస్తోంది.

మహి ఏం చెప్పాడంటే?

గోవాలో జరిగిన ఓ ఈవెంట్‌లో వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడటం గురించి ఓ ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం చెబుతూ, "నేను క్రికెట్‌లో మరికొన్ని ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాను. చివరి సంవత్సరం ఏదైనా సరే ఆస్వాదించాలనుకుంటున్నాను" అంటూ చెప్పాడు. 'క్రికెట్‌ను ప్రొఫెషనల్ గేమ్‌గా ఆడుతున్నప్పుడు, దానిని గేమ్‌గా ఆస్వాదించడం కష్టమవుతుంది. ఇది నేను చేయాలనుకుంటున్నాను. ఇది సులభం కాదు. భావోద్వేగాలు వస్తూనే ఉంటాయి. కట్టుబాట్లు ఉంటూనే ఉంటాయి. రాబోయే కొన్నేళ్లపాటు ఆటను ఆస్వాదించాలనుకుంటున్నాను' అంటూ రూమర్లకు ధోని చెక్ పెట్టేశాడు.

మహి అన్‌క్యాప్డ్ ప్లేయర్ అవుతాడా?

5 సార్లు ఐపీఎల్‌ను గెలుచుకున్న కెప్టెన్‌ ఆడడం ఐపీఎల్‌కు శుభవార్త. 2019లో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన ధోనీని కేవలం రూ.4 కోట్లకే సీఎస్‌కే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంచుకోగలదు. ఐదేళ్లుగా భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఆటగాడు అన్‌క్యాప్‌గా పరిగణిస్తారనే విషయం తెలిసిందే. ఈ నిబంధన వల్ల ధోనీకి ప్రయోజనం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories