MS Dhoni: రనౌట్..నుంచి..రనౌట్ దాకా..'ధోనీ' కెరీర్ ఆరంభమూ..ముగింపు ఒక్కటే!

MS Dhoni: రనౌట్..నుంచి..రనౌట్ దాకా..ధోనీ కెరీర్ ఆరంభమూ..ముగింపు ఒక్కటే!
x
MS Dhoni (file photo)
Highlights

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ ను అత్యంత ప్రభావితం చేసిన క్రికెటర్. కూల్ గా క్రికెట్ లోకి వచ్చి..

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ ను అత్యంత ప్రభావితం చేసిన క్రికెటర్. కూల్ గా క్రికెట్ లోకి వచ్చి.. అంతే కూల్ గా కెప్టెన్ అయి.. రెండు ప్రపంచకప్ లు సాధించి.. కూల్ గా నిష్క్రమించారు. హడావుడి లేని కెప్టెన్ గా ప్రఖ్యాతి గాంచాడు. గెలిచినా..ఓడినా.. ఒకటే! గెలుపుకు సంబరం లేదు.. ఓటమికి కుంగుబాటూ లేదు. అన్నిటికీ ఒకేలా స్పందించిన క్రికెట్ నాయకుడు.

కొన్ని విషయాలు విచిత్రంగా ఉంటాయి. అటువంటిదే ధోనీ కెరీర్ కూడా. ఎలా అయితే కెరీర్ ప్రారంభించాడో అదే విధంగా కెరీర్ ముగిసింది. వికెట్ల మధ్య పరిగేట్టడంలో.. సహచరుల్ని పరుగులు పెట్టించడంలో ధోనీ ప్రత్యేకతే వేరు. అయితే, ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఒక రనౌట్ తో ప్రారంభం అయింది.

అంతర్జాతీయ క్రికెట్ లోకి 2004, డిసెంబరు 23న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు ధోనీ. అయితే, ఆ మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. తోలి మ్యాచ్ లోనే విఫలం అయినట్టు కనిపించిన ధోనీకి అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ అండగా నిలిచారు. పసికూన బంగ్లా పైనే విఫలం అయిన ధోనీని తరువాతి మ్యాచ్ లో మూడో డౌన్ లో పంపించారు గంగూలీ. ఈ మ్యాచ్ దాయాది పాకిస్తాన్ పై. కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. తోలి మ్యాచ్ రనౌట్ చేదు అనుభవాన్ని 123 బంతుల్లో 148 పరుగులు చేసి మధురమైన స్మృతిగా మార్చేశారు. ఇక అక్కడ నుంచి ధోనీ కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది. మొదటి రనౌట్ అయినప్పుడు ఎలా స్పందించారో.. పాకిస్తాన్ పై సెంచరీ చేసీ అదే విధంగా స్పందించారు ధోనీ.

కట్ చేస్తే..

2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్‌తో బరిలోకి దిగిన ధోనీ సరిగ్గా 50 పరుగులు చేశారు. ఆ సమయానికి భారత్ ఆశలన్నీ ధోనీ మీదే ఉన్నాయి. అయితే, దురదృష్టవశాత్తూ ఆ తరువాత ధోనీ రనౌట్ అయ్యారు. దీంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమి పాలై వరల్డ్ కప్ నుంచి బయటకు వచ్చేసింది. ఇదే ధోనీ చివరి మ్యాచ్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ధోనీ నిర్ణయాలు అలానే ఉంటాయి. అకస్మాత్తుగా నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఈసారీ అలానే తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

దీంతో తానాడిన తోలి మ్యాచ్ లోనూ.. చివరి మ్యాచ్ లోనూ ధోనీ రనౌట్ గానే వెనుతిరిగినట్టయింది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. ఎప్పుడూ కూల్ గా ఉండే ధోనీ తన చివరి మ్యాచ్ లో రనౌట్ అయిన తరువాత భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యం ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచే ఉంది. ధోనీ తొలిసారి స్పందించిన ఘటన అది. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కు దూరం అవుతున్న ధోనీకి ఆ మ్యాచ్ చివరిది కావడం యాధృచ్చికమే అయినా, ధోనీ భావోద్వేగం గుర్తు వస్తే.. తన రిటైర్మెంట్ పై ధోనీ స్పందనగా అనిపిస్తే తప్పులేదు. జరిగిన ఆ మ్యాచ్‌లో ధోనీ (50: 72 బంతుల్లో 1x4, 1x6) చివర్లో రనౌటవడంతో టీమిండియా 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories