MS Dhoni : తాలా ఈజ్ బ్యాక్ .. సోషల్ మీడియాలో ధోనీ వీడియో వైరల్

మహేంద్ర సింగ్ ధోనీ
x

 మహేంద్ర సింగ్ ధోనీ 

Highlights

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరించారు.

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరించారు. ధోనీ అందరి క్రికెటర్లగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరన్న విషయం తెలిసిందే. ధోనికి సంబంధించిన విషయాలను అతని సతీమణి సాక్షి సింగే అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ధోనీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న వీడియో అందర్ని ఆశ్చర్యపరుస్తుంది.

ధోని పోస్టు చేసిన వీడియో ఏంటంటే తన ఫామ్ హౌజ్‌లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాంచీ శివార్లలోని శంబో గ్రామంలోని తన 43 ఎకరాల ఫామ్‌ హౌస్‌లో పది ఎకరాల్లో టమోటా, క్యాబేజీ, బొప్పాయి, ఇతర పంటలను పండిస్తున్నాడు. ఆ పొలంలో స్ట్రాబెర్రీలను పండిస్తున్నాడు. ఇక పంటను పరిశీలించే క్రమంలో స్ట్రాబెర్రీలను చూసిన ధోనీ ఆగలేక వాటిని తెంచి తిన్నాడు. దానికి హాస్యస్పదంగా క్యాప్షన్ ఇచ్చాడు 'నేను స్ట్రాబెర్రీ చెలో తిరిగితే మార్కెట్‌కు ఒక్క పండు కూడా వెళ్లేలా లేదు'అని క్యాఫ్షన్ ఇచ్చాడు. ధోనీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వీడియో పంచుకోవడంతో నెట్టింట వైరల్ అయింది. తాలా ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీ.. ఐపీఎల్ 2020 సీజన్ మాత్రం ఆడాడు. కానీ మునపటి సత్తా చాట లేకపోయాడు. భారత జట్టు తరపున ధోని 90 టెస్టులు ఆడి 4వేల 876 పరుగులు చేశాడు. ఇక 350 వన్టేల్లో 10,773 పరుగులు చేశాడు. 98 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. ధోనీ తన నాయకత్వంలో భారత్ కు రెండు ప్రపంచ కప్‌‌లు అందించాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories