జో రూట్ 5 వికెట్లు తీయడమంటేనే పిచ్ లో తప్పున్నట్లు: వెంగ్‌సర్కార్

Motera Pitch is bad for Test Cricket Said by Dilip Vengasarkar
x

దిలీప్ వెంగ్‌సర్కార్ (ఫోటో వికీపీడియా ) 

Highlights

Pitch Criticism: మొతేరా పిచ్ టెస్ట్ క్రికెట్ కు పనికిరాదని మాజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Pitch Criticism: మొతేరా పిచ్ టెస్ట్ క్రికెట్ కు పనికిరాదని ఓ వైపు ఇంగ్లాండ్ మీడియాతోపాటు మాజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మాజీ భారత ఆటగాళ్లు కూడా పిచ్ లో ఏదో తప్పు ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. తాజాగా మొతెరా పిచ్‌లో పెద్ద తప్పిదం ఉందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ అంటున్నాడు. భారత్, ఇంగ్లాండ్ టీంల మధ్య ఇటీవల అహ్మదాబాద్‌లోని మొతెరా వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌.. రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా.. టీం ఇండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ (11/70) దెబ్బకి ఇంగ్లాండ్ పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోగా.. నాలుగో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి మొతెరా వేదికగానే జరగనుంది.

టెస్టు క్రికెట్‌కి మొతేరా పిచ్‌ అనువైంది కాదని ఇప్పటికే హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ అభిప్రాయపడగా.. వీవీఎస్ లక్ష్మణ్‌ కూడా ఆ పిచ్‌పై పెదవి విరిచాడు. తాజాగా భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా మొతెరా పిచ్‌పై విమర్శలు గుప్పించాడు. ఇంగ్లాండ్ పార్ట్ టైమ్ బౌలర్‌గా ఉన్న జో రూట్.. 8 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీయడమే ఈ పిచ్ లో తేడా ఉందని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చాడు.

మొతెరా పిచ్ ప్రమాణాలకి తగినట్లు లేదు. ఈ విషయంలో ఎలాంటి సందేహాల్లేవు. ఇలాంటి పిచ్‌‌లు టెస్టు క్రికెట్‌కి అంత మంచిది కాదు. భారత్, ఇంగ్లాండ్ జట్లులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ.. జో రూట్‌ లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్.. బౌలర్ అవతారమెత్తి 5 వికెట్లు తీశాడంటేనే పిచ్‌లో పెద్ద తప్పిదం ఉందని తెలిసిపోతోంది'' అని వెంగ్‌సర్కార్ వెల్లడించాడు. భారత్ తరఫున వెంగ్‌సర్కార్ 116 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories