Most Dangerous Batsmen in IPL: ఐపీఎల్ విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్స్ వీళ్లే..!

Most Dangerous Batsmen in IPL: ఐపీఎల్ విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్స్ వీళ్లే..!
x

Most Dangerous Batsman in IPL

Highlights

Most Dangerous Batsmen in IPL: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ఇదో క్రీడా స‌మరం. 2008లో ప్రారంభ‌మైన ఐపీఎల్ 12 సంవ‌త్స‌రాలు విజ‌యవంతంగా పూర్తి చేసుకుంది. ఇంకో 6 రోజుల్లో దుబాయి వేదిక‌గా.. ఈ క్రీడా స‌మరం ప్రారంభం కానున్న‌ది.

Most Dangerous Batsmen in IPL: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ఇదో క్రీడా స‌మరం. 2008లో ప్రారంభ‌మైన ఐపీఎల్ 12 సంవ‌త్స‌రాలు విజ‌యవంతంగా పూర్తి చేసుకుంది. ఇంకో 6 రోజుల్లో దుబాయి వేదిక‌గా.. ఈ క్రీడా స‌మరం ప్రారంభం కానున్న‌ది. ఇక ఐపీఎల్ అంటే బాల్ కు బ్యాట్‌కు వీరోచిత‌మైన పోటీ.. బ్యాట్‌మెన్స్ వేట‌కు వెళ్లిన పుల్లుల్లా.. త‌మ బ్యాట్‌ను జులిపించి.. ప‌రుగుల వ‌ర‌ద పారిస్తారు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు ముచ్చేమ‌ట‌లు ప‌ట్టిస్తారు. గ‌త ఐపీఎల్ చ‌రిత్ర‌లో బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపెట్టిన టాప్ 5 ఆట‌గాళ్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

గ్రీస్‌గేల్‌: క‌రేబియ‌న్ వీరుడు. బౌల‌ర్ల పాలిట శ‌త్రువు. బంతికే భ‌యం పుట్టించే విధ్వంస‌కారుడు. అత‌డే క్రిస్‌గేల్ ... మైదానంలో అడుగు పెట్టడ‌మే చాలు.. బంతికి గ్రౌండ్ దాటించ‌డ‌మే అత‌ని ల‌క్ష్యం. ప్ర‌త్య‌ర్థి స‌మ‌రానికి సై అంటే.. సింపుల్‌గా.. త‌న బ్యాట్‌ను జూలిపిస్తాడు. ఇక స‌మ‌రం ప్రారంభ‌మైన‌ట్టే.. దిమ్మ తిరిగే భారీ హిట్టింగ్ల‌తో .. స్కోర్ బోర్డును అలా అలా ప‌రిగెత్తిస్తాడు. అత్య‌ధిక ప‌రుగులు చేసి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక అవుతాడు. గేల్ తన ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలిచి ఆటగాడిగా నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కూ 21 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. త‌న ఐపీఎల్ కెరియ‌ర్‌లో 6 సెంచ‌రీలు, 28 అర్థ సెంచ‌రీలు సాధించారు.

ఎంఎస్ ధోనీ: జార్ఖండ్ డైనామైట్ ఎం ఎస్ ధోనీ. తొలుత వికెట్ కీప‌ర్‌గా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం అయిన ధోనీ.. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శనిస్తూ.. వికెట్ కీప‌ర్ కాస్త విధ్వంస‌క‌ర బ్యాట్‌మెన్ గా మారాడు. సీఎస్కే జ‌ట్టుకు ప్రతినిథ్యం వ‌హిస్తూ.. మూడు సార్లు ఐపీఎల్ ట్రోపీని అందించారు. ఈ డెంజర్ ఫ్లేయ‌ర్ .. 17 సార్లు ఫ్లేయ‌ర్ ఆప్ ది అవార్డును కైవ‌సం చేసుకున్నారు. సీఎస్‌కేను చాలా సార్లు మ్యాచ్ విన‌ర్‌గా నిల‌బెట్టారు. త‌న ఐపీఎల్ కేరియ‌ర్‌లో 23 అర్థ సెంచ‌రీలు కొట్టారు.

రోహిత్ శ‌ర్మ‌: ఇత‌డి గురించి ఎంత చెప్పుకున్న చాలా త‌క్కువే.. చాలా కుల్ గా మైదానంలోకి అడుగుబెడుతాడు. ప్ర‌త్యార్థి ఎవ‌రైనా సరే.. ఓ సారి వీరంగం మొద‌లు పెట్టారంటే... త‌న‌ను అప‌డం ఎవ‌రి త‌రం కాదు. పొట్టి క్రికెట్ లోనూ సెంచ‌రీల మోత మోగిస్తారు. త‌న ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ముంబయి ఇండియ‌న్స్‌కు నాలుగు సార్లు క‌ప్ అందించి.. మోస్ట్ స‌క్సెస్ పుల్ కెప్టెన్‌గా నిలిచారు. ఇప్ప‌టివ‌ర‌కూ 183 ఇన్సింగ్ ఆడిన రోహిత్ 15 మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు గెలిచారు. త‌న ఐపీఎల్ కెరీర్‌లో 1 సెంచ‌రీ, 31 అర్థ‌సెంచ‌రీల‌తో అగ్ర‌స్థానంలో నిలిచారు.

ఏబీ డెవిలియ‌ర్స్‌: బ‌ంతి ఎలా వ‌చ్చిన సారే.. గ్రౌండ్ అవ‌త‌లికి పంపించ‌గ‌ల స‌మ‌ర్థుడు. 360 డిగ్రీల త‌న ఆడ‌గ‌ల బ్యాట్స్‌మెన్‌.. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ. 20 ఫ్లేయ‌ర్ ఆఫ్ ది అవార్డులు గెలుచుకున్నారు. కానీ 142 ఇన్సింగ్స్ ఆడిన ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ 3 సెంచ‌రీలు, 31 అర్థ సెంచ‌రీలు సాధించారు.

డెవిడ్ వార్న‌ర్‌: స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టుకు ప్ర‌తినిథ్యం వ‌హిస్తున్న ఆట‌గాడు. 17 ఫ్లేయ‌ర్స్ ఆప్ అవార్డు అందుకున్న బ్యాట్స్‌మెన్. వార్న‌ర్ మొత్తం126 మ్యాచ్‌లు ఆడి 43 హ‌ప్ సెంచ‌రీలు, 4 సెంచ‌రీలు చేసి మేటీ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories