Mohammed Shami: ప్రపంచ రికార్డు నెలకొల్పిన మహ్మద్‌ షమి

Mohammed Shami Takes 4th 5 Wicket Haul in World Cups to Set New Record
x

Mohammed Shami: ప్రపంచ రికార్డు నెలకొల్పిన మహ్మద్‌ షమి

Highlights

Mohammed Shami: ప్రపంచ కప్‌లో అత్యధికసార్లు 5వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు

Mohammed Shami: ప్రపంచ కప్‌లో అత్యధికసార్లు 5వికెట్లు తీసిన బౌలర్‌గా మహ్మద్ షమీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. షమీ ఇప్పటి వరకు నాలుగుసార్లు 5 వికెట్ల ఘనత అందుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ మూడుసార్లు ఈ ఫీట్ సాధించాడు. షమీ ఈ ప్రపంచకప్‌లోనే మూడుసార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ప్రపంచ కప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గాను షమీ రికార్డు సృష్టించాడు. 17ఇన్నింగ్స్‌ల్లోనే షమీ ఈఘనత అందుకున్నాడు.

భారత్ తరపున వరల్డ్ కప్‌లో ఎక్కువ వికెట్లు 54 పడగొట్టిన బౌలర్‌గా రికార్డును పదిలం చేసుకున్నాడు. ఈ జాబితాలో జహీర్‌ఖాన్ 44 వికెట్లు, జవగళ్ శ్రీనాథ్ 44 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ ప్రదర్శనతో ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం షమీ 23 వికెట్లతో మొదటిస్థానంలో ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories