ICC Rankings: టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ మహిళల వన్డే బ్యాటర్ల జాబితాలో టాప్-5లోకి దూసుకొచ్చింది.
ICC Rankings: టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డే ఐసీసీ ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్ల్లో టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ టాప్-5లోకి ప్రవేశించింది. బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 72 పరుగులు చేయడం మిథాలీకి కలిసొచ్చింది. 2019 అక్టోబర్‌లో చివరిసారిగా మిథాలీ తొలి ఐదుగురిలో ఉండేది. ఇంగ్లాండ్‌పై వన్డేతో 22 ఏళ్ల కెరీర్లోకి అడుగుపెట్టిన మిథాలీ.. 27కే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకుంది.
తొలి వన్డేతోనే 22 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసుకున్న మిథాలీ.. 38 ఏళ్ల వయసులోనూ యువ క్రికెటర్లతో పోటీపడి మరీ పరుగులు చేస్తోంది. 2019 తర్వాత ఆమె వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్-5లోకి అడుగుపెట్టడం విశేషం. ఇక, భారత్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తొమ్మిది స్థానంలో నిలిచింది. మరో టీమ్ఇండియా క్రికెటర్ పూజా వస్త్రాకర్ ఆల్‌రౌండర్ల జాబితాలో 97వ స్థానంలో నిలిచింది. ఇక బ్యాటర్ల జాబితాలో 88వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
In the latest @MRFWorldwide ICC Women's ODI Player Rankings for batting:
— ICC (@ICC) June 29, 2021
↗️ @M_Raj03 enters top five
↗️ @natsciver moves up one spot
Full list: https://t.co/KjDYT8qgqn pic.twitter.com/szonwdMmn9
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire