మీ నాన్న కచ్చితంగా గర్విస్తాడు..సిరాజ్ పై కేటీఆర్ ప్రశంసలు

మీ నాన్న కచ్చితంగా గర్విస్తాడు..సిరాజ్ పై కేటీఆర్ ప్రశంసలు
x

సిరాజ్ పై కేటీఆర్ ప్రశంసలు

Highlights

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్నగబ్బా టెస్టులో టీమిండియా పేస్ మహ్మద్ సిరాజ్ వికెట్ల వేట కొనసాగించాడు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్నగబ్బా టెస్టులో టీమిండియా పేస్ మహ్మద్ సిరాజ్ వికెట్ల వేట కొనసాగించాడు. సిరాజ్ ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి సత్తాచాటాడు. సిరాజ్ సాధించిన ఘనతకి నెటింట్ట ప్రసంశలు కురుస్తున్నాయి. మహ్మద్ సిరాజ్ పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రసంశలు వర్షం కురిపించారు. తండ్రిని కోల్పోయిన విషాదకర పరిస్థితిలోనూ ఈ విధంగా రాణించడం మామూలు విషయం కాదని కొనియాడారు. "నీ అద్భుత ప్రదర్శన భారత జట్టు ముందర సిరీస్ గెలిచే అవకాశాన్ని నిలిపింది. మీ నాన్న పైనుంచి దీవెనలు అందజేస్తూ నీ ఆటతీరు పట్ల కచ్చితంగా గర్విస్తాడు" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్సింగ్స్ ఇన్నింగ్స్ 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ 33 పరుగుల ఆధిక్యంతో కలిపి 328 విజయ లక్ష్యం టీమిండియా ముందు ఉంచింది. భారత బౌలర్లలో సిరాజ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. శార్థుల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ (4*), గిల్ (0*) కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్ లో సిరాజ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. శార్థుల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories