సౌతాఫ్రికాను ముంచిన వాన

సౌతాఫ్రికాను ముంచిన వాన
x
Highlights

ప్రపంచ కప్ టోర్నీలో మరో మ్యాచ్ వర్షార్పణమైపోయింది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల మధ్య ఈరోజు జరగాల్సిన మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఓటములతో...

ప్రపంచ కప్ టోర్నీలో మరో మ్యాచ్ వర్షార్పణమైపోయింది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల మధ్య ఈరోజు జరగాల్సిన మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఓటములతో కుంగి ఉన్న సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ కీలకమైనది.

మొదట మ్యాచ్ నిర్ణీత సమయానికి ప్రారంభమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. షెల్డన్‌ కాట్రెల్‌ తన పదునైన పేస్‌తో హషీమ్‌ ఆమ్లా (6; 7 బంతుల్లో 1×4), అయిడెన్‌ మార్క్రమ్‌ (5; 10 బంతుల్లో 1×4)ను పెవిలియన్‌ చేర్చాడు. 11 వద్ద ఆమ్లా, 28 వద్ద మార్క్రమ్‌ ఔటయ్యారు. డికాక్‌ (17; 21 బంతుల్లో 1×4) నిలిచాడు. డుప్లెసిస్‌ (0; 7 బంతుల్లో) కొన్ని బంతులు ఆడాడు. ఎనిమిదో ఓవర్‌లో చినుకులు మొదలయ్యాయి. మూడు బంతులు పడ్డ తర్వాత అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత చిరుజల్లులు ఆగుతూ.. పడుతూ చివరి వరకు దోబూచులాడాయి. వాతావరణం సహకరించకపోవడంతో చివరికి రిఫరీ మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరుజట్లకు తలా ఒక పాయింట్ వచ్చింది. సౌతాఫ్రికా సెమీస్ ఆశలు మరింత క్లిష్టమయ్యాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories