India vs Australia: సిడ్నీ టెస్టులో స్లెడ్జింగ్.. వైరల్ వీడియో

India vs Australia: సిడ్నీ టెస్టులో స్లెడ్జింగ్..  వైరల్ వీడియో
x
Highlights

స్లెడ్జింగ్ మారు పేరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఇతర జట్ల ఆటగాళ్లపై కవ్వింపు చర్యలతో.. వారి ఏకాగ్రతను దెబ్బతియడంలో ఆసీస్ ప్లేయర్లకు ఎవరూ సాటిరారు. అయితే...

స్లెడ్జింగ్ మారు పేరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఇతర జట్ల ఆటగాళ్లపై కవ్వింపు చర్యలతో.. వారి ఏకాగ్రతను దెబ్బతియడంలో ఆసీస్ ప్లేయర్లకు ఎవరూ సాటిరారు. అయితే ఐపీఎల్ లో కారణంగా భారత్ ప్లేయర్లపై స్లెడ్జింగ్ చేయడానికి వారు ఆసక్తి చూపరు. తాజాగా బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్నమూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నోటికి పనిచెప్పారు. టీమిండియా ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, మరో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పై మార్నస్ లబుషేన్ కవ్వించాడు.

భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా.. షార్ట్‌ లెగ్‌లో హెల్మెట్ పెట్టుకొని ఫీల్డింగ్ చేసిన లబుషేన్ తన మాటలతో విసిగించాడు. తొలుత 'నీ ఫేవరేట్ క్రికెట్ ఎవరు?'అని శుభ్‌మన్ ప్రశ్నించగా.. అతను మ్యాచ్ ముగిసిన తర్వాత చెబుతానని బదులిచ్చాడు. ఆ వెంటనే సచినా? అని ప్రశ్నిస్తూ.. విరాట్ కోహ్లీని లెక్కలోకి తీసుకోవా? అని అడిగాడు. ఆ తర్వాత క్యాచ్ క్యాచ్ అంటూ బ్యాటింగ్ చేస్తున్న హిట్‌మ్యాన్‌ను టీజ్ చేశాడు.

క్వారంటైన్‌లో ఏం చేశావని రోహిత్ శర్మను అడిగాడు. కానీ రోహిత్ అతని మాటలను ఏ మాత్రం లేదు. తర్వాత కూడా హడావుడిగా మాట్లాడుతూ భారత బ్యాట్స్‌మెన్‌ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. ఈ సంభాషణను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(సీఏ) ట్వీట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.




Show Full Article
Print Article
Next Story
More Stories